- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోల్డ్ మెడల్ పొందిన బొమ్మేన యువకుడు
శాతవాహన విశ్వవిద్యాలయ ద్వితీయ స్నాతకోత్సవ వేడుకలు శుక్రవారం కరీంనగర్ లో జరిగాయి. ఈ వేడుకల్లో బొమ్మేన గ్రామానికి

దిశ, కథలాపూర్: శాతవాహన విశ్వవిద్యాలయ ద్వితీయ స్నాతకోత్సవ వేడుకలు శుక్రవారం కరీంనగర్ లో జరిగాయి. ఈ వేడుకల్లో బొమ్మేన గ్రామానికి చెందిన ఊరుమల్ల రాజ్ కుమార్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా బీఏ గోల్డ్ మోడల్ అందుకున్నారు. అలాగే నందగిరి అనంతరాజ శర్మ మెమోరియల్ గోల్డ్ మెడల్ ను ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బి. జే రావు చేతుల మీదుగా అందుకున్నాడు.
కాగా రాజ్ కుమార్ తండ్రి నరహరి వృత్తి రీత్య గోల్డు స్మిత్. తనకు వచ్చే కొద్దిపాటి సంపాదన కావడంతో కొడుకును స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివిపించాడు. అయిన కూడా రాజ్ కుమార్ చిన్నప్పటి నుండి చదువులో చురుకుగా రానిస్తూ 2017-2020 సంవత్సరంలో బి. ఎ పూర్తి చేశాడు. అలాగే ఎం. ఏ తెలుగు, సంస్కృతం లో డబుల్ పీజీ ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో పూర్తి చేశాడు. రాజ్ కుమార్ సాధించిన విజయం పట్ల గ్రామస్థులు అతని మిత్రులు హార్షం వ్యక్తం చేశారు.
- Tags
- man
- gold medal






