మృత్యువుతో పోరాడి ఓడిన యువకుడు..

by Naveena |   (  Updated:2025-03-11 06:42:00  IST  )

ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో "మోనింజైటిస్" వ్యాధితో నీరటి సాయికుమార్ (33) 15 రోజులు మృత్యుతో పోరాడి మృతి చెందాడు.

మృత్యువుతో పోరాడి ఓడిన యువకుడు..
X

దిశ, ఎల్లారెడ్దిపేట : ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో "మోనింజైటిస్" వ్యాధితో నీరటి సాయికుమార్ (33) 15 రోజులు మృత్యుతో పోరాడి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే... సాయికుమార్ కు 15 రోజుల క్రితం అనారోగ్యంతో ఉండగా సిరిసిల్లలోని ప్రైవేట్ హాస్పిటల్ లో సుమారు రెండు లక్షల వరకు అప్పు చేసి మెరుగైన వైద్యం అందించారు. చేతిలో ఉన్న డబ్బులు ఖర్చవడంతో అక్కడ నుండి వెంటిలేటర్ పై హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో చేర్పించగా.. ఉదయం రెండు గంటల ప్రాంతంలో మరణించారు. భర్తను కాపాడుకునే మార్గంలో భార్య రమ్య అప్పుచేసి ప్రైవేట్ హాస్పిటల్ లో చూపించగా.. డబ్బులు లేకపోవడంతో గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. కుటుంబ పెద్ద దిక్కు మరణించడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ప్రస్తుతం అంత్యక్రియలు, దినకర్మ చేసుకునే స్తోమత లేక కుటుంబం తల్లడిల్లుతుంది. కావున దయార్థహృదయులుఉంటే దినకర్మ కు సహకరించి మానవత్వాన్ని చాటుకోగలరని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. మృతునికి భార్య నీరటి రమ్య, కూతురు లిహాన్సిక (2) ఉన్నారు. సాయికుమార్ బావ బత్తుల లక్ష్మణ్ ఫోన్ పే, గూగుల్ పే నంబర్ 9441341108 కు ఆర్థిక సహాయం చేయగలరు

Next Story