- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోమో సెక్స్ కోసం పిలిచి.. దాడి చేసి డబ్బులు,సెల్ ఫోన్ లాక్కున్న దుండగులు
హోమో సెక్స్ అంటూ పిలిచి దాడికి పాల్పడ్డ ఇద్దరి వ్యక్తులను సోమవారం కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు.

దిశ, కరీంనగర్ రూరల్ : హోమో సెక్స్ అంటూ పిలిచి దాడికి పాల్పడ్డ ఇద్దరి వ్యక్తులను సోమవారం కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ కథనం ప్రకారం.. ఈ నెల 14 న కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, కౌటాల మండలం, గురుడుపేట గ్రామానికి చెందిన రమిల్లా కృష్ణమూర్తి కొన్ని రోజుల క్రితం ‘ గ్రైండర్ ’ డేటింగ్ అప్ ద్వారా ట్రాన్స్‌జెండర్ తో పరిచయం ఏర్పడి హోమో సెక్సువల్ అలవాటు కలిగి ఉన్నట్టు మెసేజ్ చేయడంతో జుమైర్ అనే వ్యక్తి తనతో హోమోసెక్స్ , మసాజ్ చేయాలని చెప్పి దానికి డబ్బులు ఇస్తానని చెప్పడంతో కృష్ణమూర్తి అంగీకరించి బెల్లంపల్లి వద్ద ట్రైన్ ఎక్కి కరీంనగర్ తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్ చేరుకొని జుమైర్ అనే వ్యక్తి తన బైక్ పై కృష్ణ మూర్తిని బొమ్మకల్ బైపాస్ లోని ఓ ప్రవేట్ ఫంక్షన్ హాల్ వెనకాలకు తీసుకెళ్లి హోమో సెక్స్ చేయాలని బట్టలు విపించగా అంతలోనే మరో ఇద్దరు వ్యక్తులు అక్కడికి చేరుకొని ఈ పని చేసి ఎంత డబ్బు సంపాదించావు? అని ప్రశ్నిస్తూ తన దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇవ్వకపోతే అక్కడికక్కడే చంపేస్తామని బెదిరించగా.. దాంతో భయపడి కృష్ణ మూర్తి తన దగ్గర ఉన్న రూ.1,500/- నగదు ,తన సెల్ ఇచ్చేశాడు అని ఏసీపీ విజయ్ కుమార్ తెలిపారు. బాధితుడు కృష్ణ మూర్తి ఫిర్యాదుతో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ ఆదేశాలమేరకు సీఐ నిరంజన్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టే క్రమంలో సోమవారం తీగలగుట్టపల్లి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒక్కరు మైనరు కాగా A1 గా రేకుర్తి కి చెందిన సయ్యద్ అబ్బాస్ అలియాస్ అర్బస్, A2 గా కిసాన్ నగర్ కు మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ గా పోలీసులు గుర్తించారు. నేరానికి ఉపయోగించిన ఫోన్స్,ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకొని కోర్టుకు తరలించారు పోలీసులు. ఈ సందర్భంగా త్వరితగతిన కేసు ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంతో సీపీ గౌస్ ఆలం సీఐ నిరంజన్ రెడ్డి ని,ఎస్ఐలు నరేష్,లక్ష్మా రెడ్డిని అభినందించారు.






