రాష్ట్ర ప్రభుత్వం మక్కలు కొనుగోలు చేస్తూ రైతులకు అండగా..

by Ratna Kumari |

రాష్ట్ర ప్రభుత్వం మొక్కలను కొనుగోలు చేస్తూ రైతులకు అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మక్కలు కొనుగోలు చేస్తూ రైతులకు అండగా..
X

దిశ, సుల్తానాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మొక్కలను కొనుగోలు చేస్తూ రైతులకు అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంట గ్రామంలో మార్క్ ఫేడ్, సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న, వడ్ల కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణ రావు సందర్శించారు. కొనుగోళ్లలో జాప్యం జరుగుతున్న విషయమై అప్పటికప్పుడు అధికారులతో చర్చించి రైతుల సమస్యలను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొనుగోళ్ల విషయంలో చిన్న చిన్న విషయాలను రాద్ధాంతం చేసి రాజకీయాలు చేయడం తగదన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో పారదర్శకంగా కొనుగోలు జరుపుతున్నట్టు తెలిపారు.

అధికార యంత్రాంగంతో రైస్ మిల్లర్లపై ఒత్తిడి తెచ్చి వడ్ల దిగుమతిని చేయిస్తూ ప్రతిక్షణం పర్యవేక్షణ జరుపుతున్నామని అన్నారు. ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వం సేకరించిన మక్కలకు మార్కెటింగ్ లేకున్నప్పటికీ నష్టాన్ని భరిస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తుంద‌ని తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో అప్పటి ప్రజా ప్రతినిధుల సహకారంతో కొనుగోళ్లలో పూర్తి స్థాయిలో రైతులకు అన్యాయం జరిగిందని, అప్పడు నోరు మెదపని వారు ఇప్పుడు పారదర్శకంగా కొనుగోలు జరుగుతున్నప్పటికీ రాద్ధాంతం చేయడం తగదన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్, పలు గ్రామాల సర్పంచ్ లు మండల పార్టీ అధ్యక్షులు చిలుక సతీష్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Next Story