- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కన్నకొడుకే కాలయముడయ్యాడు.. ఇంతకీ తండ్రి చేసిన తప్పేంటి!
ఎల్లారెడ్దిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధి కిషన్ దాస్ పేటలోని ఒడ్డెర కాలానికి చెందిన కుంచపు కనకయ్య (50) కొడుకు చేతిలో శుక్రవారం ప్రాణాలు కోల్పోయాడు.

దిశ, ఎల్లారెడ్దిపేట : ఎల్లారెడ్దిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధి కిషన్ దాస్ పేటలోని ఒడ్డెర కాలానికి చెందిన కుంచపు కనకయ్య (50) కొడుకు చేతిలో శుక్రవారం ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కనకయ్య హమాలీ పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు. శుక్రవారం తండ్రి కనకయ్య కుమారుడు పర్శరాములు(25) కు మాటల యుద్ధం జరిగింది. మాటా మాట పెరగడంతో క్షణి కావేశానికి లోనై ఇంటి ఆరుబయట ఉన్న కట్టే తో కనుకయ్యను పర్శరాములు తల వెనుక భాగంపై కొట్టడంతో కనకయ్య అక్కడే పడిపోయాడు. చుట్టుపక్కల గల వారు గమనించి కనకయ్య ను ఆసుపత్రికి అంబులెన్సు లో తరలించగా ఆయన్ని పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు ధ్రువీకరించారు.
సంఘటన స్థలాన్ని స్థానిక సి ఐ బి. శ్రీనివాస్ గౌడ్, ఎస్.ఐ నేరెళ్ల రమాకాంత్ సందర్శించారు. కాగా తండ్రిని చంపిన కొడుకు పర్శరాములు పరారీ లో ఉన్నాడు. మృతునికి భార్య దేవవ్వ, కుమార్తెలు సుమలత, మౌనిక లు ఉన్నారు. నిందితుడు పర్శరాములు గతంలో మండలకేంద్రం లో గల గిద్దె చెరువులో చేపలు పట్టడం కోసం విద్యుత్ షాక్ పెట్టిన కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. తండ్రిని చంపడానికి వాడిన కట్టెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కనకయ్య మృతి తో కిషన్ దాస్ పేట లో విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్తం నిమిత్తం సిరిసిల్ల ఏరియాసుపత్రికి తరలించారు.






