- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
farmer loan : జూలై 30న రైతు రుణమాఫీ రెండో విడత విడుదల..
by Batti.Sumithra |
రైతు రుణమాఫీ రెండో విడత నిధులను ప్రభుత్వం జూలై 30న ఉదయం 11 గంటల 45 నిమిషాలకు విడుదల చేస్తుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

X
దిశ, పెద్దపల్లి : రైతు రుణమాఫీ రెండో విడత నిధులను ప్రభుత్వం జూలై 30న ఉదయం 11 గంటల 45 నిమిషాలకు విడుదల చేస్తుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 30న ఉదయం 11 గంటల 45 నిమిషాలకు సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రజాప్రతినిధుల సమక్షంలో రెండో విడత రుణమాఫీ కార్యక్రమం జరుగుతుందని, రైతులకు లక్షా 50 వేల వరకు ఉన్నరుణాలను మాఫీ చేస్తామని అన్నారు.
రెండో విడత రుణమాఫీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, సహకార శాఖ సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో రుణమాఫీ లబ్ధిదారులు రైతులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Next Story






