- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వం ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బీజేపీ మండల అధ్యక్షులు గుండెబోయిన భూమయ్య, ఊరగొండ అపర్ణ ఆధ్వర్యంలో బుధవారం రామగుండం ఎమ్మార్వోకి వినతిపత్రం అందజేశారు.

దిశ, గోదావరిఖని : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బీజేపీ మండల అధ్యక్షులు గుండెబోయిన భూమయ్య, ఊరగొండ అపర్ణ ఆధ్వర్యంలో బుధవారం రామగుండం ఎమ్మార్వోకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రామగుండం ఇన్ చార్జి కందుల సంధ్యారాణి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చిందని, అయితే రెండు సంవత్సరాలు గడిచినా వాటిలో ఇప్పటి వరకు ఏ ఒక్కటి అమలు కాలేదని విమర్శించారు. ముఖ్యంగా యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య, వితంతు దివ్యాంగులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, పేదలకు గృహ నిర్మాణ పథకం, రైతులకు రైతు భరోసా, భూ సమస్యల పరిష్కారం వంటి హామీలు ఇప్పటికీ అమలు కాలేదని పేర్కొన్నారు.
మండలంలో రైతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతు భరోసా సమయానికి అందకపోవడంతో అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆసరా పెన్షన్లు అందడం లేదని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. పేదలకు గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు మంజూరు ప్రక్రియ ఆలస్యం అవుతుందని, భూభారతి రెవెన్యూ సదస్సుల్లో ఇచ్చిన దరఖాస్తులు ఇంకా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని తక్షణమే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. అదనంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, వీధి దీపాల వంటి సమస్యలు అధికంగా ఉన్నాయని, వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ముసుకుల భాస్కర్ రెడ్డి, సుల్వ లక్ష్మీనరసయ్య, కోడూరి రమేష్, మాదరబోయిన రాకేష్, రామగిరి నరేష్, పాకాల నరసింహారెడ్డి, ఎల్తూరి సరిత, ఎల్తూరి రాజయ్య, అంకరి భరత్, ఆకునూరి రమేష్, కొమురవెల్లి విశ్వనాథ్, ఇరుగు రాళ శివ, ఆలకుంట మహేష్, గోగుల రమేష్, సాయి పాల్గొన్నారు.






