మూడు గ్రామాల ప్రజల ఆందోళన.. ఎందుకంటే..?

by Naveena |

రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజి నుంచి మండల కేంద్రం గన్నేరు వరంకు ప్రారంభించిన డబుల్ రోడ్డు పనులు సాగడం లేవని నిరసనకు దిగారు.

మూడు గ్రామాల ప్రజల ఆందోళన.. ఎందుకంటే..?
X

దిశ, గన్నేరువరం: రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజి నుంచి మండల కేంద్రం గన్నేరు వరంకు ప్రారంభించిన డబుల్ రోడ్డు పనులు సాగడం లేవని నిరసనకు దిగారు. వెంటనే రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని గుండ్లపల్లి, గునుకుల కొండాపూర్, జంగాపల్లి గ్రామాల ప్రజలు గునుకుల కొండాపూర్ గ్రామంలోని కంకర రోడ్డుపై కూర్చొని ఆందోళన చేశారు. వచ్చి పోయే వాహనాలను ఆపి వారి నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ..ఎన్నో రోజులుగా పోరాటం చేయగా మంజూరైన డబుల్ రోడ్డు నత్త నడకన సాగుతుందని, కాంట్రాక్టర్ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. గునుకుల కొండాపూర్ నుండి జంగా పెల్లి వెళ్లే మార్గంలో కంకర పోసి వదిలేయడంతో.. వాహనదారులకు, ప్రయాణికులకు కంకర ప్రమాద భరితంగా మారిందన్నారు. వాహనాల టైర్లు కంకరతో పంచర్లు పడుతున్నాయని, ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారని, పెద్ద వాహనాలు వెళ్లేటప్పుడు కంకర గాలిలో ఎగిరి రోడ్డు వెంట వెళ్లే వారికి తగిలి గాయాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తక్షణమే అధికార పార్టీ నాయకులు స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్, అధికారులపై చర్యలు తీసుకునేలా చూడాలన్నారు. 10 రోజుల్లో వేసిన కంకరపై డాంబర్ వేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన మరో మారు రోడ్డు కోసం ఉద్యమం చేయక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి పరశురాం, గుడెల్లి మల్లేశం, కోతి ఆంజనేయులు, చొక్కల రాజకుమార్,చొక్కల మల్లేశం న్యాలపట్ల రవి, కొంకటి గణేష్ ,కొమ్మరసుధాకర్ రెడ్డి, ముదిగంటి తిరుపతిరెడ్డి, ముదిగంటి మోహన్ రెడ్డి, వడాల గోపాల్ రెడ్డి, హనుమాన్ల రాజిరెడ్డి, చొక్కల మహేష్ , చొక్కల సంజీవ, బత్తిని శ్రీను గండికోట నరసయ్య, తాట్లెంక శ్రీనివాస్, బత్తిని శ్రీనివాస్,తాళ్లపల్లి శివమణి, పొలం వేణు, కాల్వ సంతు, కాల్వ శ్రీశాంత్, గుర్రం ఆదర్శ్, బోయిని వంశీ, పెంట శ్రీనివాస్ ఉన్నారు.

Next Story