- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిత్రం..విచిత్రం.. తాటి చెట్టుకు పసుపు రంగులో కల్లు..!
సాధారణంగా తాటికల్లు ఏ రంగులో ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ పెద్దపల్లి జిల్లా మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామంలోని తాటి వనంలో ఓ తాటి చెట్టుకు వింతగా పసుపు రంగులో తాటి కల్లు రావడం పట్ల ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు.

దిశ, పెద్దపల్లి /ముత్తారం : సాధారణంగా తాటికల్లు ఏ రంగులో ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ పెద్దపల్లి జిల్లా మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామంలోని తాటి వనంలో ఓ తాటి చెట్టుకు వింతగా పసుపు రంగులో తాటి కల్లు రావడం పట్ల ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు. రోజువారీగా తాటి చెట్లు ఎక్కేందుకు వచ్చిన కునూరి సత్తయ్య గౌడ్ తాటి చెట్టు ఎక్కి కళ్ళు గీస్తుండగా.. ఒక గెల నుంచి తాటికల్లు పసుపు రంగులో రాగా ఆ గౌడ్ ఆశ్చర్యానికి గురయ్యాడు. రోజు తాటికల్లు తెలుపు రంగులో వచ్చే కల్లు.. ఉన్నట్టుండి సోమవారం పసుపు రంగులో రావడం ఏంటని గౌడ్ ఆశ్చర్యానికి గురయ్యాడు. దీంతో వెంటనే తాటి చెట్టు దిగి తోటి గీత కార్మికులకు ఈ విషయాన్ని తెలిపారు. అడవి శ్రీరాం పూర్ గ్రామంలోని తాటి వనంలో ఎల్లమ్మ గుడి నిర్మాణం పనులు పూర్తి అయి కొద్ది రోజుల్లోనే ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉన్నందున ఎల్లమ్మ తల్లి దివ్య ఆశీస్సులతోనే తాటికల్లు పసుపు రంగులో పారిందంటూ గౌడ కులస్తులు ఒకరికొకరు చెప్పుకోవడంతో ఈ విషయం కాస్త గ్రామం అంతా వ్యాపించడంతో ఆ తాటికల్లును చూసేందుకు గ్రామస్తులు.. ఆశ్చర్యానికి గురయ్యారు. ఏది ఏమైనా రోజు వారీగా తాటికల్లును గీసే గౌడ్ తాటి చెట్టుకు పసుపు రంగులో తాటికల్లు రావడంతో ఆ తల్లి మహిమ అని అందరూ అంటుండడంతో వెంటనే ఎల్లమ్మ తల్లికి మొక్కుకొని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లిం చుకుని త్వరలోనే గుడి ప్రారంభోత్సవం చేస్తామని వేడుకున్నారు.






