- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే లక్ష్యం : మంత్రి శ్రీధర్ బాబు
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాసనసభ వ్యవహారాల మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు అన్నారు.

దిశ, మంథని : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాసనసభ వ్యవహారాల మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం మంథని మున్సిపాలిటీ పరిధిలో రూ.32 లక్షల వ్యయంతో నిర్మించిన ఎంపీపీఎస్, జేబిఎస్ మంథని పాఠశాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పాఠశాల పరిసరాల్లో విద్యార్థి, విద్యార్థినులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి ద్వారా ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు ప్రజలు పాల్గొన్నారు.






