రైతుల సంక్షేమానికి నూతన పాలకవర్గం నిబద్ధతతో పని చేయాలి

by Taduka Kalyani |

రైతుల సంక్షేమానికి నూతనంగా నియామకమైన పాలకవర్గం నిబద్ధతతో పని చేయాలని డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.

రైతుల సంక్షేమానికి నూతన పాలకవర్గం నిబద్ధతతో పని చేయాలి
X

దిశ, చొప్పదండి, జూలై 27 : రైతుల సంక్షేమానికి నూతనంగా నియామకమైన పాలకవర్గం నిబద్ధతతో పని చేయాలని డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని స్థానిక ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గం ఆశీర్వాద సభకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చైర్మన్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ నిజానపురం చందు, డైరెక్టర్ లను శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. నూతనంగా ఏర్పాటైన పాలకవర్గం రైతుల పట్ల విశ్వాసం కలిగించేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. సింగిల్ విండో ద్వారా రైతులకు అందే ఎరువులు, విత్తనాలు, పంట ఋణాల పంపిణీని మరింత సులభతరం చేయడంపై నూతన కమిటీ ప్రత్యేకంగా దృష్టి సారించాలని, తద్వారా ఈ సొసైటీ దేశానికే ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు, సింగిల్ విండో చైర్మన్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ నిజానపురం చందు, డైరెక్టర్ లు, మున్సిపల్ చైర్ పర్సన్ వడ్లూరి సరిత శ్రీనివాస్, వైస్ చైర్ పర్సన్ పెరుమండ్ల మానసగంగయ్య గౌడ్, మున్సిపల్ పాలకవర్గం, వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటి రెడ్డి పద్మాకర్ రెడ్డి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు పురం రాజేశం, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్న, చొప్పదండి మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరు మహేష్, సర్పంచులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, రైతులు,అధికారులు పాల్గొన్నారు.

Next Story