ప్రయాణికుడి బ్యాగ్ చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్

by Nallavelli.Anjaneyulu |

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : బస్సులో ప్రయాణం చేస్తున్న వ్యక్తి డబ్బుల బ్యాగును దొంగిలించిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు.

ప్రయాణికుడి బ్యాగ్ చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : బస్సులో ప్రయాణం చేస్తున్న వ్యక్తి డబ్బుల బ్యాగును దొంగిలించిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. శుక్రవారం సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో పట్టణ సీఐ కృష్ణతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జిల్లాలోని వేములవాడ పట్టణానికి చెందిన నార్ల శ్రీనివాస్ హైదరాబాద్ కి రూ.3,97,500/ నగదుతో పాటు ఆయా గుర్తింపు కార్డులు, రెండు చెక్కులు ఉన్న పర్సును క్యాష్ బ్యాగ్‌లో ఉంచుకొని డిసెంబ‌ర్ 03న వేములవాడ బస్టాండ్ వద్ద బస్సులో లాస్ట్ సీట్ కింద బ్యాగ్ ఉంచి కూర్చొని బయలుదేరాడు. కాసేపటికి ముందు సీటుకు మారి కూర్చున్నాడు. తంగళ్ళపల్లిమండల కేంద్రానికి చేరుకోగానే వెనుక సీటుకు వెళ్లి చూడగా బ్యాగ్ కనిపించలేదు. దీంతో శ్రీనివాస్ కండక్టర్‌ను విచారించగా.. సిరిసిల్ల వద్ద ఒక వ్యక్తి బస్సు దిగినట్టు చెప్పారు. శ్రీనివాస్ సిరిసిల్ల పట్టణ పోలీసులను ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని పోలీస్ సిబ్బంది వెంటనే రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వేములవాడ నుంచి సిరిసిల్ల వరకు ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని వేములవాడ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన బండారి బాలరాజు గా గుర్తించి శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు తాను వేములవాడలోనే సిద్దిపేట్ బస్సులో ఎక్కి వెనుక సీటులో కూర్చుని, బ్యాగ్‌లో ఉన్న డబ్బులను చూసి దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు నిందితుడి వద్ద నుంచి మొత్తం నగదును రికవరీ చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.

Next Story