- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దోపిడికి గురైన ఎస్బీఐ ఏటీఎం మిషన్ ఆచూకీ లభ్యం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని దుర్గమ్మ ఆలయం సమీపంలోని ఎస్ బి ఐ ఏ టి ఎం లోని ఎటిఎం మిషన్ ను ఎత్తుకెళ్లిన దొంగలు ఇదే మండలంలోని అక్కపల్లి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఏ టి ఎం మిషన్ ను వదిలేసి పోయారు.

దిశ, ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని దుర్గమ్మ ఆలయం సమీపంలోని ఎస్ బి ఐ ఏ టి ఎం లోని ఎటిఎం మిషన్ ను ఎత్తుకెళ్లిన దొంగలు ఇదే మండలంలోని అక్కపల్లి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఏ టి ఎం మిషన్ ను వదిలేసి పోయారు. ఏటిఎం మిషన్ ను బద్దలు కొట్టి డబ్బులు దోచుకొని దొంగలు పారిపోయారు. ఏటిఎం మిషన్ ను దొంగలు ఎత్తుకెళ్లిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి పోలీస్ బృందాలచే గాలింపు చర్యలు చేపట్టగా అక్కపల్లి గ్రామ శివారులోని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ పరిసరాలలో పగుల గొట్ట బడి వున్న ఎస్ బి ఐ ఏ టి ఎం మిషన్ ను కనుగొన్నారు.
ఏటిఎం మిషన్ లభ్యం పై పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారముఅందడంతో జిల్లా ఎస్ పి మహేష్ బి గీతే,డి ఎస్ పి నాగేంద్ర చారి,సి ఐ వెంకటేష్ , ఎస్ ఐ రాహుల్ రెడ్డిలు చేరుకొని ఏ టి ఎం మిషన్ ను పరిశీలించారు. దొంగలు ఎత్తుకెళ్లిన ఏ టి ఎం మిషన్ ను పగుల గొట్టి అందులో ఉన్న లక్షల రూపాయలు తీసుకొని పారిపోయారని పోలీసులు గుర్తించారు. బొలెరో వాహనంలో వచ్చిన దొంగలు పకడ్బందీగా ఏ టి ఎం లో చొరబడి ఏకంగా ఏ టి ఎం మిషన్ ను ఎత్తుకు వెళ్ళి మారుమూల గ్రామం అయిన అక్కపల్లి బుగ్గ రామలింగేశ్వర ఆలయం ప్రాంతంలో నిర్మానుష్య ప్రదేశంలో ఏ టి ఎం మిషన్ ను పగుల కొట్టి డబ్బులతో పారిపోయిన దోపిడి దొంగల ఆచూకీ కి పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.






