- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిగువ మానేరుకు జలకళ.. రాత్రికి రాత్రే పెరిగిన ఇన్ ఫ్లో
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఉన్న దిగువ మానేరు జలాశయానికి రాత్రికి రాత్రే భారీగా ఇన్ ఫ్లో పెరిగింది.

దిశ, తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఉన్న దిగువ మానేరు జలాశయానికి రాత్రికి రాత్రే భారీగా ఇన్ ఫ్లో పెరిగింది. దీంతో వెంటనే ఎస్ఆర్ఎస్పీ అధికారులు అప్రమత్తమై అనుక్షణం ప్రాజెక్ట్ లోకి వస్తున్న ఇన్ ఫ్లోను గమనిస్తూ క్రస్ట్ గేట్లు పది ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
రాత్రికి రాత్రే పెరిగిన ఇన్ఫ్లో.. అధికారుల అప్రమత్తం..
దిగువ మానేరు జలశయానికి, మిడ్ మానేరు జలాశయంతో పాటు కాకతీయ కాలువ నుంచి అధికారులు దాదాపు పది వేల క్యూసెక్కుల నీటిని వదులుతుండగా ఎల్ ఎం డి ప్రాజెక్టు అధికారులు గురువారం సాయంత్రం వరకు కేవలం నాలుగు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. రాత్రి వేళ మానేరు జలాశయం పరివాహక ప్రాంతం నుంచి దాదాపు 30 వేల క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వస్తున్న ఇన్ ఫ్లోను నిశితంగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అర్ధరాత్రి సమయంలో 10 గేట్లను రెండు ఫీట్ల మేర ఎత్తి 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. అయినప్పటికీ ఇన్ ఫ్లో మరింత పెరగడంతో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఆరు గేట్లు మూడు ఫీట్ల మేర, నాలుగు గేట్లను రెండు ఫీట్ల మీద ఎత్తి దాదాపు 36 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.






