- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జిల్లాలో ఇన్‌ఛార్జి పాలన ఇంకెన్నాళ్లు ?
జిల్లాలో ఇన్‌ఛార్జి పాలనాధికారి పాలన గత నాలుగు నెలలుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇంకెన్నాళ్లు ఇన్చార్జి పాలన అంటూ జిల్లా ప్రజల నుంచి బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : జిల్లాలో ఇన్‌ఛార్జి పాలనాధికారి పాలన గత నాలుగు నెలలుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇంకెన్నాళ్లు ఇన్చార్జి పాలన అంటూ జిల్లా ప్రజల నుంచి బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు సిరిసిల్ల అంటేనే ఐఏఎస్ అధికారులు విముఖత చూపుతున్నట్లు ప్రచారం కొనసాగుతుంది. కాగా ఇన్‌ఛార్జి కలెక్టర్ గా గరిమా అగర్వాల్జిల్లాలో తనదైన శైలిలో పనిచేస్తూ మార్క్ ఏర్పరచుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆమెకే జిల్లా పాలనాధికారిగా పూర్తి బాధ్యతలు అప్పగించాలన్న బలమైన వాదనలు జిల్లా ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి.
నాలుగు నెలలుగా ఇన్చార్జి పాలన
గత ఏడాది సెప్టెంబర్ నెలలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా గరిమా అగర్వాల్‌ను ప్రభుత్వం నియమించింది. అప్పుడు జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న హరిత లాంగ్ లీవ్ పై వెళ్లగా, గరిమా అగర్వాల్ నియమించబడిన రోజు నుంచే జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అలాగే జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ గా కొనసాగుతున్నారు. అయితే లాంగ్ లీవ్ పై వెళ్లిన హరితను ప్రభుత్వం ఇటీవల ఓ శాఖకు ప్రత్యేక కార్యదర్శిగా నియమించింది.
విముఖత చూపుతున్న ఐఏఎస్ అధికారులు
ఇదిలా ఉండగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా పని చేసేందుకు ఐఏఎస్ అధికారులు విముఖత చూపుతున్నట్లు ప్రచారం కొనసాగుతుంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సిరిసిల్లలో బలంగా ఉండటం.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించడంతో ఏ చిన్న పొరపాటు జరిగిన అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారనుందని ఐఏఎస్ అధికారులు జంకుతున్నట్లు వినబడుతోంది. సందీప్ కుమార్ ఝా బదిలీ అనంతరం వచ్చిన హరిత కూడా సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా పని చేయడానికి విముఖత చూపినట్లు తెలిసింది. అందుకే ఆమె జాయిన్ అయిన కొద్ది రోజులకే లాంగ్ లీవ్ పై పెట్టుకొని వెళ్లినట్లు వినబడుతోంది. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం నుంచి బలమైన ఒత్తిళ్లు ఉంటాయన్న నెపంతో ఐఏఎస్ అధికారులు సిరిసిల్లకు రావడానికి ఇష్టపడడం లేదని ఉద్యోగ వర్గాల్లో చేర్చ కొనసాగుతోంది.
ఇన్‌ఛార్జి కలెక్టర్ గా గరిమా అగర్వాల్ మార్క్
అయితే జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన నుంచి గరిమా అగర్వాల్తనదైన శైలిలో పనిచేస్తూ జిల్లాలో మార్క్ ఏర్పరచుకున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు అన్ని రాజకీయ పార్టీల నేతలతో కలివిడిగా ఉంటూ ముందుకు వెళుతున్నారు. అంతేకాకుండా జిల్లా అధికార యంత్రాంగాన్ని సమన్వయ పరుస్తూ పరుగులు పెట్టిస్తున్నారు. నిత్యం ఆకస్మిక తనిఖీలు, ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు చెమట పట్టిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందజేయడంలో కీలక భూమిక పోషిస్తున్నారు.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడమే గరిమా అగర్వాల్పనితనానికి నిదర్శనం. అతి త్వరలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుండడం.. తదనంతరం స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ప్రభుత్వం నిర్వహించడం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో గరిమా అగర్వాల్‌కు జిల్లా పాలనాధికారిగా పూర్తి బాధ్యతలు అప్పగించాలని జిల్లా ప్రజల నుంచి బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. పూర్తి బాధ్యతలు అప్పగిస్తే ఆమె రెట్టింపు ఉత్సాహంతో మరింత చురుగ్గా పనిచేస్తుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.






