- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి భావోద్వేగం.. ప్రచారానికి విరాళం అందజేసిన చిన్నారి
ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు గ్రామగ్రామాన తిరుగుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

దిశ, జగిత్యాల టౌన్ : ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు గ్రామగ్రామాన తిరుగుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల మండలం చల్గల్ గ్రామానికి ప్రచారానికి వెళ్లారు. గ్రామంలో ప్రచారం చేస్తుండగా.. ఓ చిన్నారి జీవన్ రెడ్డికి ఎలక్షన్ ఫండ్‌ను అందచేసింది. గ్రామానికి చెందిన శ్రీనిత్య తన కిడ్డీ బ్యాంక్ ద్వారా జమా చేసిన 4792 రూపాయలను తన విరాళంగా అందజేసింది. ఆ చిన్నారి చేసిన సాయానికి జీవన్ రెడ్డి ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఆ చిన్నారిని ఎత్తుకుని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
రాజకీయాలలో భౌతిక దాడులు హేయనీయం
దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన భౌతిక దాడిని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి ఖండించారు. రాజకీయాలలో భౌతిక దాడులు హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రభాకర్ రెడ్డి పై సదరు వ్యక్తి ఎందుకు దాడి చేశాడో సమగ్ర విచారణ జరపాలన్నారు. అయితే దాడికి పాల్పడిన వ్యక్తి జర్నలిస్టుగా తెలియ వచ్చిందని, ఒకవేళ దాడి చేసిన వ్యక్తి జర్నలిస్టు అయితే అతడికి అన్ని పార్టీలతో సంబంధాలు ఉండే అవకాశం ఉందన్నారు. రాజకీయాలలో భౌతిక దాడులు మంచివి కాదని, ఏ రాజకీయ పార్టీ కుట్రకు పాల్పడ్డా ఆ పార్టీకే తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఓటమి ఖాయమని కేసీఆర్ కూడా ఓడిపోక తప్పదని జోష్యం చెప్పారు. అంతకుముందు ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన వేడుకలలో ఎమ్మెల్సీ పాల్గొని ఘన నివాళులు అర్పించారు.






