అత్తింటి వేధింపులు తాళ‌లేక యువ‌తి ఆత్మ‌హ‌త్య

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-12-07 14:59:53  IST  )

దిశ‌, కోరుట్ల : అత్తింటి వేధింపులు తాలలేక యువతి ఆత్మహత్యకి పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో చోటుచేసుకుంది.

అత్తింటి వేధింపులు తాళ‌లేక యువ‌తి ఆత్మ‌హ‌త్య
X

దిశ‌, కోరుట్ల : అత్తింటి వేధింపులు తాలలేక యువతి ఆత్మహత్యకి పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో చోటుచేసుకుంది. కోరుట్ల ఎస్ఐ చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణం అల్లమ్మయ్యగుట్ట కాలానికి చెందిన ఆడెపు రచన, జోగ లహరి(28) అనే యువతిని ఐదు సంవత్సరాల క్రితం మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామనికి చెందిన జోగ రాజేష్ తో తులంన్న‌ర‌ బంగారం కట్నంతో పెళ్లి జరిగింది. అదనంగా మూడు లక్షలు వరకట్నం తేవాలని భర్త రాజేష్, మృతిరాలి అత్త దేవక్క, మామ దుబ్బయ్య, ఆడ బిడ్డ మమత, ఆడబిడ్డ భర్త వాసం రాజులు అదనపు కట్నం మూడు లక్షలు తేవాలని శారీరకంగా, మానసికంగా, వేధించి ఈ నెల ఒకటో తేదీన ఇంట్లో నుంచి గెంటివేశారు. తల్లి వద్ద ఉంటున్న మృతురాలు జీవితం పై విరక్తి చెంది శనివారం ప్రభాకర్ రావు కు చెందిన వ్యవసాయ బావిలో పడి మరణించింది. మృతిరాలికి ఐదు సంవత్సరాల అక్షర అనే పాపా కలదు. మృతురాలు తండ్రి ఆడెపు రవి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేటున్నట్లు ఎస్సై తెలిపారు.

Next Story