- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, జగిత్యాల టౌన్ : చల్లగా బీర్ వేసి చిల్ అవుదాం అనుకున్న ఓ యువకుడికి షాక్ తగిలింది. మంగళవారం సాయంత్రం జగిత్యాల పట్టణం బైపాస్ రోడ్డులో గల ఓ వైన్ షాప్ లో యువకుడు బీర్ బాటిల్ కొనుగోలు చేశాడు. ఇంటికెళ్లి అన్ని సిద్ధం చేసుకుని తాగుదాం అనుకునేసరికి ఆ బాటిల్ లో ఏదో తేడాగా కనిపించింది. నిశితంగా పరిశీలించగా ఆ బీర్ బాటిల్ లో చెత్త తో పాటు పాకురు కనిపించింది. అప్పటికే వైన్స్ క్లోజింగ్ టైం అవ్వడంతో ఆ బీర్ బాటిల్ అలాగే ఉంచి బుధవారం ఉదయం తీసుకెళ్లి వైన్ షాప్ నిర్వాహకులకు రిటర్న్ ఇచ్చేసాడు. ఆ యువకుడికి మరో బీర్ రీప్లేస్ చేసిన వైన్స్ నిర్వాహకులు ఇలా ఎందుకు వచ్చిందో తమకు కూడా తెలియదని తాము కూడా కంపెనీకి ఆ బాటిల్ రిటర్న్ పంపిస్తామని తెలిపారు. అయితే ఆ బీర్ బాటిల్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Next Story






