- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వృద్ధురాలి అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్.. అడవిలోకి తీసుకెళ్లి అత్యంత దారుణంగా..
ఈ నెల 16 వ తేదిన మధ్యాహ్నం అదృశ్యమయిన వృద్దురాలు ఆచూకీ లభించింది

దిశ బ్యూరో, కరీంనగర్ : ఈ నెల 16న అదృశ్యమైన వృద్ధురాలు ఆచూకీ లభించింది. గంగాధర మండలం మధురానగర్‌లో అదృశ్యమైన పెగూడ మల్లవ్వ గంభీరావు పేట మండలంలో హత్యకు గురైంది. ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించమని అడిగినందుకే హత్య చేసినట్టు తెలుస్తుంది. గంగాధర మండలం మధురానగర్‌కు చెందిన పెగూడ మల్లవ్వ పరిచయస్తులకు 2 లక్షల రూపాయలు అప్పు ఇచ్చినట్టు సమాచారం.
అయితే ఆ అప్పు తిరిగి చెల్లించమని అడిగిన పాపానికి మల్లవ్వను ఈ నెల 16న అపహరించి అదేరోజు రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీరావు పేట మండల పరిధిలో హత్య చేసి సమాధి చేసినట్టు సమాచారం. అయితే మల్లవ్వ సోదరుడు ఈరవేణి రాయమల్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసునమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించిగా నిందితులు మల్లవ్వను హత్యచేసి సమాధి చేసినట్టుగా వెల్లడించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నేరస్తులను అదుపులోకి తీసుకుని పూర్తి సమాచారం సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మల్లవ్వ అపహరణ సమాచారం తెలుసుకున్నప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నే ఆమెను గ్రామం నుంచి దూర ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.
- Tags
- karimnagar
- crime






