విద్యాశాఖ వారోత్సవాలను ఉత్సవంలా నిర్వహించాలి

by Ratna Kumari |

విద్యాశాఖ వారోత్స‌వాల‌ను ఉత్స‌వంలా నిర్వ‌హించాల‌ని విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి యోగితా రాణా అధికారులను ఆదేశించారు.

విద్యాశాఖ వారోత్సవాలను ఉత్సవంలా నిర్వహించాలి
X

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : విద్యాశాఖ వారోత్స‌వాల‌ను ఉత్స‌వంలా నిర్వ‌హించాల‌ని విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి యోగితా రాణా అధికారులను ఆదేశించారు. గురువారం హైద‌రాబాద్ నుంచి విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి క‌లెక్ట‌ర్లు, అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్లు, డీఈవోల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ప్ర‌జా పాల‌న-ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక లో భాగంగా మే 11 నుంచి 18 వ‌ర‌కు జ‌రుగ‌నున్న విద్యాశాఖ వారోత్స‌వాల‌ను ఉత్స‌వంలా నిర్వ‌హించాల‌ని తెలిపారు.

ప్ర‌తి గ్రామంలో పెద్ద ఎత్తున నిర్వ‌హించాల‌ని సూచించారు. ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్లాల‌ని తెలిపారు. అలాగే బ‌డిబాల కార్య‌క్ర‌మాన్ని నిర్వహించాలని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరేలా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విద్యాశాఖ వారోత్సవాలను అందరూ సమన్వయంతో విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, కోఆర్డినేటర్లు మిల్కూరి శ్రీనివాస్‌, అశోక్ రెడ్డి, శ్రీనివాసు ఉమారాణి తో పాటు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

Next Story