- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లింగంపల్లి శేఖర్ మృతి బాధాకరం
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లింగంపల్లి శేఖర్ మృతి చెందడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.

దిశ, కొత్తపల్లి : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లింగంపల్లి శేఖర్ మృతి చెందడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. ఇటీవల అనారోగ్యంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లింగంపల్లి శేఖర్ చెందిన విషయం తెలిసిందే. మంగళవారం వారి కుటుంబ సభ్యులను వెలిచాల రాజేందర్ రావు పరామర్శించారు. శేఖర్ చిత్రపటం వద్ద రాజేందర్ రావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా శేఖర్ మృతికి గల కారణాలు అడిగి తెలుసుకుని అధైర్య పడవద్దని రాజేందర్ రావు వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. లింగంపల్లి శేఖర్ మంచి వ్యక్తి అని, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పని చేస్తున్నారనీ, ఆయన మృతి తీరని లోటు అని రాజేందర్ రావు విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల నరసయ్య, ఆకుల నందిని ఉదయ్, వేల్పుల వెంకటేష్, గండి రాజేశ్వర్ గండి శ్యామ్, గండి గణేష్, లింగంపల్లి శ్రీనివాస్, లింగంపల్లి బాబు, అశోక్ పాల్గొన్నారు.






