మున్సిపాలిటీలు గెలవాల్సిందే.. ఎన్నికలను ఛాలెంజ్ తీసుకున్న కాంగ్రెస్

by Malleboina Mahesh |

మున్సిపల్ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించిన కాంగ్రెస్ అదే ఊపులో మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలనే దిశగా అడుగులు వేస్తుంది.

మున్సిపాలిటీలు గెలవాల్సిందే.. ఎన్నికలను ఛాలెంజ్ తీసుకున్న కాంగ్రెస్
X

దిశ, బ్యూరో కరీంనగర్ : మున్సిపల్ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించిన కాంగ్రెస్ అదే ఊపులో మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలనే దిశగా అడుగులు వేస్తుంది. త్వరలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న దృష్ట్యా ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులను సన్నద్ధం చేసింది. ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి స్థానిక నేతలకు, నియోజకవర్గ ఇన్​చార్జీలకు ఆదేశాలు జారీ చేసింది. వర్గపోరు వీడి మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలని అధిష్టానం వార్నింగ్ ఇచ్చింది. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఆధిపత్య, వర్గపోరు కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో ఆధిపత్య పోరుతో సత మతం అవుతుండగా, ఇన్​చార్జులు ఉన్న నియోజకవర్గాల్లో సైతం వర్గపోరు అతలాకుతలం చేస్తుంది. వీటికి చెక్ పెట్టి సమష్టిగా పని చేసి అభ్యర్థులను గెలిపించుకుని అన్ని మున్సిపాలిటీలను దక్కించుకోవాలని అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది .

గ్రూపులు వీడి గెలుపే లక్ష్యంగా పని చేయండి

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించిన కాంగ్రెస్ అదే ఊపులో మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలనే దిశగా అడుగులు వేస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులను సన్నద్ధం చేసింది. ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేసింది. స్థానిక నేతలకు, నియోజకవర్గ ఇన్​చార్జులకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. వర్గపోరు వీడి మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలని అధిష్టానం వార్నింగ్ ఇచ్చింది.

కరీంనగర్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో దాదాపు అన్ని చోట్ల ఆదిపత్య, వర్గ పోరు కాంగ్రెస్ పార్టీలో నెలకొనడంతో వీటికి చెక్ పెట్టి సమష్టిగా పని చేసి అభ్యర్థులను గెలిపించుకుని అన్ని మున్సిపాలిటీలను దక్కించుకోవాలని అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అధిస్థానం ఆదేశాలు ఎక్కడైనా పాటించక ఫలితాలు తారుమారైతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, ఇందులో మినహాయింపు ఉండబోదనే హెచ్చరికలు జారీ చేసింది అధిష్టానం. దీంతో నియోజకవర్గ ఇన్​చార్జులకు మున్సిపల్ పోరు పరీక్షగా మారింది. మున్సిపల్ ఎన్నికల ఇన్​చార్జులుగా తుమ్మల నాగేశ్వరరావు బాధ్యతలు అప్పగిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.

ఫలితాలు రాకపోతే ఇన్​చార్జి పదవులు ఊస్టింగ్ ..!

మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గ ఇన్​చార్జీల భవితవ్యం ఆధారపడి ఉంది. అధిష్టానం ఆదేశాల మేరకు ఫలితాలు సానుకూలంగా రానిపక్షంలో గత సర్పంచ్ ఎన్నికల్లో ఫలితాలు రాని నియోజకవర్గ ఇన్​చార్జిలకు కాంగ్రెస్ అధిష్టానం హెచ్చరికలు జారీ చేసింది. అధికారంలో ఉండి కూడా సర్పంచ్ మెజార్టీ స్థానాలు గెలుచుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్పంచ్ ఫలితాలు నేపథ్యంలో ఈసారి పార్టీ గుర్తులపై జరిగే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని మున్సిపాలిటీలను హస్తగతం చేసుకోవాలని అధిష్టానం ఆదేశించింది.

ఇందులో భాగంగా ఇన్​చార్జ్​లకు కీలకమైన ఊడిపోనుంది. ఆయా మున్సిపాలిటీల పరిధిలోని ఇన్​చార్జులు ఏ పరిస్థితిలో అయినా కాంగ్రెస్ జెండా ఎగిరేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఎన్నికల ఫలితాలను ఇన్​చార్జుల పనితీరుకు ప్రామాణికంగా అధిష్టానం పరిగణించనుంది. దీంతో ఇప్పటి నుంచే నియోజకవర్గ ఇన్​చార్జులు అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం ఇతర వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

రంగంలోకి మంత్రులు, ఎమ్మెల్యేలు

ఉమ్మడి జిల్లాకు ఇన్​చార్జిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. అభ్యర్థులను ఎంపిక చేసే ముందు ప్రతి ఒక్కరూ పార్టీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. వీటన్నిటిని ప్రత్యేక కమిటీ పరిశీలన చేసి స్థానిక ఇన్​చార్జీలతో పూర్తిస్థాయిలో వాస్తవ పరిస్థితులను చర్చించి అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని సూచించింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి అనేకమంది కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు దరఖాస్తులు చేసుకున్నారు. పాత, కొత్త కలయికలు అభ్యర్థుల ఎంపిక జరగనుంది.

గెలిచే వారికి మాత్రమే టికెట్లను ఇవ్వడం అనేది అధిష్టానం ప్రధానంగా తీసుకుంది. జిల్లాలో ముఖ్య నేతలు ఎమ్మెల్యేలతో కలిసి ప్రత్యేక కమిటీ ఉండగా, వీరందరినీ సమన్వయం చేయడంతో పాటు ఎన్నికలను పూర్తిగా నిర్వర్తించేందుకు జిల్లాకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను ఇన్​చార్జిగా కేటాయిస్తూ పీసీసీ నిర్ణయం తీసుకుంది. జిల్లాకు ఇన్చార్జి మంత్రి కేటాయింపు జరగడంతో ఇక రాజకీయం వేడెక్కనుంది. ఇన్చార్జి మంత్రి ఆదేశాల మేరకు కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో అధిష్టానం ఆదేశాల మేరకు ముందుకు సాగనుంది. పక్కా ప్రణాళిక బద్ధంగా బీజేపీ, బీఆర్​ఎస్​ లను టార్గెట్ చేసి మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని చూస్తోంది.

Next Story