కుంగిన జంగపల్లి కల్వర్టు

by Elthuri vijay kumar |

మండలంలోని జంగపల్లి గ్రామ సమీపంలో ఉన్న లో లెవెల్ కల్వర్టు భారీ వాహనాల రాకపోకలకు, ఊర చెరువు మత్తడి నీటి ప్రవాహానికి కృంగిపోయి పెద్ద గొయ్యి ఏర్పడింది.

కుంగిన జంగపల్లి కల్వర్టు
X

కుంగిన జంగపల్లి కల్వర్టు

ప్రమాదకరంగా మారిన గొయ్యి

భారీ వాహనాలు, వర్షాలే కారణం

మరమ్మతులు చేయించాలని స్థానికుల డిమాండ్

దిశ, గన్నేరువరం: మండలంలోని జంగపల్లి గ్రామ సమీపంలో ఉన్న లో లెవెల్ కల్వర్టు భారీ వాహనాల రాకపోకలకు, ఊర చెరువు మత్తడి నీటి ప్రవాహానికి కృంగిపోయి పెద్ద గొయ్యి ఏర్పడింది. మత్తడి నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం మూలంగా ఏర్పడిన గొయ్యి వాహనదారులకు కనబడడం లేదు. మంగళవారం ఉదయం ఓ ఆటో గొయ్యి కనబడక అందులో దిగబడిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి దానిని బయటకు తీశారు. రాత్రి వేళల్లో అయితే వాహనాలు గొయ్యిలో పడి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నది. అధికారులు తక్షణం స్పందించి కల్వర్టుపై ఏర్పడ్డ గొయ్యిని వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని, లో లెవెల్ కల్వర్టులు వెంటనే మార్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story