- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కన్నతల్లిపై కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన పిల్లలు
by Ratna Kumari |
జగిత్యాల జిల్లా ఆరపేట కు చెందిన అన్నా, చెల్లెల్లు (పిల్లలు) కన్న తల్లి పై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. నాన్న మరణానంతరం ఆయన సంపాదించిన భూమి మొత్తాన్ని తమ తల్లి వందన దొంగ విరాసత్ చేయించుకుందని నాగరాణి ఫిర్యాదులో పేర్కొంది.

X
దిశ, జగిత్యాల కలెక్టరేట్ : జగిత్యాల జిల్లా ఆరపేట కు చెందిన అన్నా, చెల్లెల్లు (పిల్లలు) కన్న తల్లి పై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. నాన్న మరణానంతరం ఆయన సంపాదించిన భూమి మొత్తాన్ని తమ తల్లి వందన దొంగ విరాసత్ చేయించుకుందని నాగరాణి ఫిర్యాదులో పేర్కొంది. తాము మైనర్లు కావడంతో తమ తండ్రి సంపాదించిన భూమి మొత్తాన్ని తమకు తెలియకుండానే కోటి నాలుగు లక్షల రూపాయలకు అమ్మేసిందని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. తమకు న్యాయంగా, వారసత్వంగా రావాల్సిన వాటా ఇప్పించాలని అధికారులకు విన్నవించారు. ఇదిలా ఉంటే.. భూమి అమ్మకానికి సంబంధించిన కోటి రూపాయల లావా దేవి మొత్తం క్యాష్ రూపంలోనే జరిగిందని.. అదంతా బ్లాక్ మనీ అని ఈ విషయంలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా తెలపడం కొసమెరుపు.
Next Story






