బైక్ ను ఢీ కొట్టిన కారు.. వ్యక్తి పరిస్థితి విషమం

by Ratna Kumari |

బైకు ను కారు ఢీ కొట్టిన జ‌గిత్యాల రూర‌ల్ మండ‌ల ప‌రిధిలోని మోరాప‌ల్లి వ‌ద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..

బైక్ ను ఢీ కొట్టిన కారు..  వ్యక్తి పరిస్థితి విషమం
X

దిశ, జగిత్యాల రూరల్ : బైకు ను కారు ఢీ కొట్టిన జ‌గిత్యాల రూర‌ల్ మండ‌ల ప‌రిధిలోని మోరాప‌ల్లి వ‌ద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండ‌ల ప‌రిధిలోని సింగ‌రావుపేట గ్రామానికి చెందిన గాడిపెళ్లి ల‌క్ష్మ‌ణ్ జ‌గిత్యాల నుంచి సింగ‌రావుపేట‌లోని త‌న ఇంటికి బైకు పై వెళ్తున్నాడు. ఇదే స‌మ‌యంలో మోరాప‌ల్లి గ్రామం వ‌ద్ద‌కు చేరుకోగానే వెనుక వైపు నుంచి కారు ఢీ కొట్టింది. దీంతో ల‌క్ష్మ‌ణ్ త‌ల‌కు తీవ్ర‌గాయాల‌య్యాయి. వెంట‌నే ఆసుప‌త్రికి తర‌లించారు. ప్ర‌స్తుతం అత‌ని ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు స‌మాచారం. కారు డ్రైవ‌ర్ పరార్ అయిన‌ట్టు స్థానికులు తెలిపారు.

Next Story