తనపై జరుగుతున్న ప్రచారం శుద్ధ అబద్ధం : న్యాయ‌వాది మ‌ర్రి వెంక‌ట‌స్వామి

by Ratna Kumari |

విద్యార్థి దశ నుంచే ఏఐఎస్ఎఫ్ లో విద్యార్థుల సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహించి తర్వాత సీపీఐ లో క్రియాశీలకంగా పని చేస్తూ తాడిత, పీడిత వర్గాల కోసం నిరంతరం అనేక ఉద్యమాలో పాల్గొన్న త‌న‌పై ఇటీవల కొన్ని పత్రికల్లో వచ్చిన భూకబ్జాలపై వార్తలు శుద్ధ అబద్ధమని మర్రి వెంకటస్వామి పేర్కొన్నారు.

తనపై  జరుగుతున్న ప్రచారం శుద్ధ అబద్ధం : న్యాయ‌వాది మ‌ర్రి వెంక‌ట‌స్వామి
X

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : విద్యార్థి దశ నుంచే ఏఐఎస్ఎఫ్ లో విద్యార్థుల సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహించి తర్వాత సీపీఐ లో క్రియాశీలకంగా పని చేస్తూ తాడిత, పీడిత వర్గాల కోసం నిరంతరం అనేక ఉద్యమాలో పాల్గొన్న త‌న‌పై ఇటీవల కొన్ని పత్రికల్లో వచ్చిన భూకబ్జాలపై వార్తలు శుద్ధ అబద్ధమని మర్రి వెంకటస్వామి పేర్కొన్నారు. సీపీఐ పార్టీలో అంతర్గత విషయాలపై రాష్ట్ర పార్టీకి నివేదించడం జరిగిందని, రాష్ట్ర పార్టీ కంట్రోల్ కమిషన్ విచారించే సమయంలోనే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా ఏకపక్షంగా ప్రకటించారని ఆయన అన్నారు. శతాబ్దాలుగా జిల్లా పార్టీ అభివృద్ధి కోసం అనేక పోరాటాల్లో బాగా సామినేని అనేక కేసులను ఎదుర్కొన్నాను, జైలు పాలు అయినా విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. భూకబ్జాలకు నిజమైన రాజకీయాలకు పాల్పడలేదు నీతి నిజాయితీకి నిబద్ధతకు మారుపేరుగా ఇన్ని రోజులు పార్టీలో పని చేశానని.. కానీ పార్టీలో కొందరు నా ఎదుగుదలను జీర్ణించుకోలేక తనపై పనిగట్టుకుని నాటి నుండి నేటి వరకు అసత్య ప్రచారం చేయడం జరుగుతుందన్నారు.

కొంతమంది చెప్పుడు మాటలు విని నేను పరారీలో ఉన్నానని, పార్టీ నేతగా న్యాయవాదిగా చలామణి అవుతూ బోధనాలు చేస్తున్నానని కొన్ని పత్రికల్లో రాసిన వార్తలు విచార విచారించదగ్గ విషయమని, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తద్వారా అధికారులు విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని, పోలీసు అధికారుల విషయంలో తప్పని తేలితే ఎంత పెద్ద వారైనా శిక్ష అనుభవించే అనుభవించాల్సిందేనని అలాగే నేను సైతం తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తానని అన్నారు, పత్రికల్లో వచ్చిన వార్తల కట్టింగులు మా పార్టీలోని కొందరు నన్ను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నిస్తూ సోషల్ మీడియా సీపీఐ పార్టీ గ్రూపులో పెట్టారని, ఇలాంటి వార్తలు పెట్టిన వారిపై నేను చట్టరిత్తే వారిపై చర్యలు తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు.

Next Story