మహిళను వేధించిన వ్యాపారి.. అందరి నోట అదే మాట

by Naveena |

పారిశ్రామిక ప్రాంతంలో గృహోపకరణాలు, ఫర్నిచర్ వ్యాపారం నిర్వహిస్తున్న బడా వ్యాపారవేత్త మహిళలను వేధిస్తున్నాడని నిరసన తెలిపారు.

మహిళను వేధించిన వ్యాపారి.. అందరి నోట అదే మాట
X

దిశ, గోదావరిఖని: పారిశ్రామిక ప్రాంతంలో గృహోపకరణాలు, ఫర్నిచర్ వ్యాపారం నిర్వహిస్తున్న బడా వ్యాపారవేత్త మహిళలను వేధిస్తున్నాడని నిరసన తెలిపారు. ఈ సంఘటన గోదావరిఖనిలోని లక్ష్మీ నగర్ లో ఉదయం చోటు చేసుకుంది. పదేపదే ఫోన్లు చేస్తున్నాడని తమ ఫోటోలు అతని ఫోన్ లో ఉన్నాయని,అవి గ్రూపులో సెండ్ చేస్తానని బెదిరిస్తునట్లు మహిళలు తీవ్రస్థాయిలో ఆరోపించారు. మేము నిలదీయగానే తప్పించుకొని ఉరికాడని అతనిని వదిలేది లేదని హెచ్చరించారు. షాప్ యజమాని ఇక్కడికి రావాలని మాకు సమాధానం చెప్పే వరకు వెళ్లేది లేదన్నారు. ఇంతకుముందు కూడా మహిళల విషయంలో ఇలానే వ్యవహరిస్తే దేహశుద్ధి కూడా చేశారని స్థానికులు తెలిపారు. పరిశ్రమ ప్రాంతంలో వ్యాపారి మహిళలను వేధిస్తున్నాడని ఇదే విషయం అందరూ మాట్లాడుకుంటున్నారు. గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు చేరుకొని బాధిత మహిళలను జరిగిన సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పూర్వపరాలను ఎంక్వయిరీ చేస్తున్నారు.

Next Story