కొండగట్టులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం

by Ratna Kumari |

జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు సమీపంలోని బొజ్జ పోతన్న ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ల‌భ్య‌మైన ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది.

కొండగట్టులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం
X

దిశ, కొండగట్టు : జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు సమీపంలోని బొజ్జ పోతన్న ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ల‌భ్య‌మైన ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. సుమారు 60 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన ఓ మగ వ్యక్తి మృతదేహం పూర్తిగా ఎండిపోయిన స్థితిలో కనిపించడంతో అక్కడి నుంచి వెళ్లే స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు కొంతకాలం క్రితమే మరణించి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అనంతరం పంచనామా నిర్వహించి పోస్టుమార్టం (PME) నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. మృతుడి వివరాలు ఇప్పటివరకు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఆయన ఎవరు, ఎక్కడి వ్యక్తి అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్టు ఎస్సై వెల్లడించారు.

Next Story