- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆడబిడ్డల ఆశీర్వాదమే ప్రజా ప్రభుత్వానికి అండ
ఆడబిడ్డల ఆశీర్వాదమే ప్రజా ప్రభుత్వానికి కొండంత అండ అని మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.

ఆడబిడ్డల ఆశీర్వాదమే ప్రజా ప్రభుత్వానికి అండ
- ప్రతి అక్క, చెల్లె కోటీశ్వరులే
- రేవంతన్న సర్కార్ లక్ష్యం ఇదే : మంత్రి సీతక్క
- కరీంనగర్ లో అట్టహాసంగా బతుకమ్మ వేడుకలు
దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : ఆడబిడ్డల ఆశీర్వాదమే ప్రజా ప్రభుత్వానికి కొండంత అండ అని మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. బుధవారం రాత్రి కరీంనగర్ సర్కస్ గ్రౌండ్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి అక్క చెల్లెలను కోటీశ్వరులుగా చేయడమే రేవంత్ రెడ్డి సర్కారు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎన్నో ప్రజోపయోగ పథకాలను ప్రవేశపెట్టి ముందుకెళ్తున్నామని అన్నారు. బతుకమ్మ పండుగ వందల ఏళ్ల నాటి ఆచార, సాంప్రదాయమని, ఈ పండగ మరో వెయ్యేండ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. మహిళలంతా ఐక్యంగా, సంతోషంగా ఉండాలన్నారు. మహిళలకు ఆర్థికంగా, రాజకీయంగా తోడ్పాటు అందించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, ఎప్పుడూ తోడుగా ఉంటుందని తెలిపారు. కోటి మందిని కోటీశ్వరులను చేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పం దిశగా ముందుకు వెళుతున్నామని తెలిపారు. ట్రాన్స్ జెండర్లకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తోందని అన్నారు. వారు సమాజంలో భాగమని, వారిని గౌరవించాలని సూచించారు. ఇప్పటికే హైదరాబాదులో 40 మంది ట్రాన్స్ జెండర్లకు ట్రాఫిక్ లో ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆచార సంప్రదాయానికి ప్రతీక అని అన్నారు. రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులు చేయాలన్న ఆకాంక్షతో ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు.
గ్రామీణ, పట్టణాల్లో బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని అన్నారు. హైదరాబాదులో టూరిజం అభివృద్ధి ఘననీయంగా చేస్తామని తెలిపారు. అనంతరం మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, మహిళా కమిషన్ రాష్ట్ర చైర్పర్సన్ నేరెళ్ల శారద, తెలంగాణ ఉమెన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, జిల్లా కలెక్టర్ పమేళా సత్పతి, మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకున్నారు. మహిళలతో బతుకమ్మ ఆడి పాడారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్ రమేష్ బాబు పాల్గొన్నారు. అంగన్వాడి టీచర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, మెప్మా, డి ఆర్ డి ఏ సభ్యులు, మహిళా పోలీసులు, అధికారులు ఉద్యోగులు సిబ్బంది ఈ ఉత్సవాల్లో పాలు పంచుకున్నారు.






