- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ మాయం..!
by Ratna Kumari |
హుజురాబాద్ మండలంలోని సిర్సపల్లి గ్రామంలో ద్విచక్రవాహనం చోరీకి గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

X
దిశ, హుజూరాబాద్ రూరల్ : హుజురాబాద్ మండలంలోని సిర్సపల్లి గ్రామంలో ద్విచక్రవాహనం చోరీకి గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఎడవెల్లి సుధాకర్ రెడ్డి బుధవారం రాత్రి తన ఇంటి ముందు ద్విచక్రవాహనాన్ని పార్క్ చేసి నిద్రపోయారు. గురువారం ఉదయం నిద్రలేచి చూసేసరికి ఇంటి ముందు ఉంచిన వాహనం కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినప్పటికీ వాహనం ఆచూకి లభించలేదు. దీంతో బాధితుడు సుధాకర్ రెడ్డి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాత్రి వేళల్లో అపరిచిత వ్యక్తులు గ్రామంలో సంచరిస్తున్నారా..? అనే కోణంలో విచారణ చేపడుతున్నారు.
Next Story






