డివైడ‌ర్ ని ఢీ కొన్న బైకు.. ఒక‌రికీ తీవ్ర గాయాలు

by Ratna Kumari |

ధర్మారం మండల కేంద్రంలోని అయ్యప్ప గుడి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కావ‌డంతో పాటు మరొకరికి స్వల్ప గాయాలైన సంఘటన చోటు చేసుకుంది.

డివైడ‌ర్ ని ఢీ కొన్న బైకు.. ఒక‌రికీ తీవ్ర గాయాలు
X

దిశ, ధర్మారం: ధర్మారం మండల కేంద్రంలోని అయ్యప్ప గుడి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కావ‌డంతో పాటు మరొకరికి స్వల్ప గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మారం మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన మద్దెల సాగర్, మేకల వంశీ బైక్ పై ప్రయాణిస్తున్న సమయంలో అయ్యప్ప గుడి సమీపంలో బైక్ అదుపుతప్పి డివైడ‌ర్ ని ఢీకొంది. ఈ ప్రమాదంలో సాగర్ తలకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. వంశీ కి స్వల్ప గాయాలు అయ్యాయి. 108 సిబ్బంది గాయపడిన ఇద్దరినీ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story