- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ ఆశయాలు స్ఫూర్తిదాయకం
బంజారా సమాజానికి దారి దీపంగా నిలిచి ధర్మం, సేవ, సమానత్వం మార్గాన్ని చూపించిన మహానుభావుడు సంత్ సేవాలాల్ మహారాజ్ అని కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామ సర్పంచ్ వంకాయల గౌతమి ప్రశాంత్ కొనియాడారు.

దిశ, కోనరావుపేట : బంజారా సమాజానికి దారి దీపంగా నిలిచి ధర్మం, సేవ, సమానత్వం మార్గాన్ని చూపించిన మహానుభావుడు సంత్ సేవాలాల్ మహారాజ్ అని కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామ సర్పంచ్ వంకాయల గౌతమి ప్రశాంత్ కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలంలోని కొండాపూర్ గ్రామ పరిధిలోని హనుమాన్ తండలో నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ బోధనలు నేటి సమాజానికి ఎంతో ఆవశ్యకమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలవాలని, ఆయన చూపిన బాటలో నైతిక విలువలను పెంపొందించుకోవాలని కోరారు. సమాజంలో ఐక్యత, శాంతి, సౌభ్రాతృత్వం మరింత బలపడాలని ఆకాంక్షించారు. సేవాలాల్ చూపిన అహింసా మార్గం, పర్యావరణ పరిరక్షణ, వ్యసనాలకు దూరంగా ఉండాలనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తండా వాసులు సాంప్రదాయ వేషధారణలతో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.






