కరీంపేటలో ఉద్రిక్తత..పోలీసుల లాఠీ చార్జ్

by velandi.Saikiran |

కరీంపేట్ గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ నేప‌థ్యంలో కాంగ్రెస్ అభ్యర్థికి బిజెపి అభ్యర్థి కంటే రెండు ఓట్లు ఎక్కువ వ‌చ్చాయి

కరీంపేటలో ఉద్రిక్తత..పోలీసుల లాఠీ చార్జ్
X

దిశ, శంకరపట్నం: కరీంపేట్ గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ నేప‌థ్యంలో కాంగ్రెస్ అభ్యర్థికి బిజెపి అభ్యర్థి కంటే రెండు ఓట్లు ఎక్కువ వ‌చ్చాయి. దీంతో బిజెపి అభ్యర్థి పలుమార్లు రీ-కౌంటింగ్ చేయించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పెద్ద మొత్తంలో జనం గుమ్మి కూడా రాదని పోలీసులు పలుమార్లు హెచ్చరించారు. అయినా వినిపించుకోకపోవడంతో స్వల్ప లాఠీ చార్జ్ చేశారు. అనంతరం ఓట్లను తిరిగి లెక్కించి బిజెపి అభ్యర్థికి 503 ఓట్లు ,కాంగ్రెస్ అభ్యర్థి కి 505 ఓట్లు వ‌చ్చిన‌ట్లు రిటర్నింగ్ అధికారి వెల్ల‌డించారు. ఈ త‌రుణంలోనే కాంగ్రెస్ అభ్యర్థి ఎగ్గని శ్రీలతను విజేతగా ప్రకటించారు.

Next Story