- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లైంగిక దాడి కేసులో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష
మహిళ పై లైంగిక దాడి కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 6,600 జరిమానా విధిస్తూ జగిత్యాల జిల్లా న్యాయస్థానం సెషన్స్ జడ్జి నారాయణ శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించింది.

దిశ, గొల్లపల్లి : మహిళ పై లైంగిక దాడి కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 6,600 జరిమానా విధిస్తూ జగిత్యాల జిల్లా న్యాయస్థానం సెషన్స్ జడ్జి నారాయణ శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించింది. సీఐ కోటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన దండేపల్లి మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన నరేండ్ల మహేందర్(29) యువకుడు గతంలో రహస్యంగా చిత్రీకరించిన వీడియోలతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేస్తానని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు సమాచారం.
బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా.. గొల్లపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ కేసును సీఐ కోటేశ్వర్ సమగ్రంగా విచారించి నిందితుడినీ అరెస్ట్ చేసి.. సాక్ష్యాధారాలను కోర్టులో దాఖలు చేశారు. కోర్టు నిందితుడు మహేందర్ ను దోషిగా తేల్చి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.6,600 జరిమానా విధించింది. ఎస్పీ మాట్లాడుతూ మహిళల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మహిళలు.. విద్యార్థినులు తమపై జరిగే వేధింపులు, అన్యాయాల గురించి నిర్భయంగా ముందుకొచ్చి పోలీసులకు పిర్యాదు చేస్తే నిందితుల పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమాజంలో నేరం చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని అన్నారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడటంతో కృషి చేసిన పోలీస్ అధికారులను ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.






