ప్రచారానికి రూ.1000, కార్నర్ మీటింగ్ కు రూ.500, బిర్యాని

by velandi.Saikiran |   (  Updated:2026-02-08 22:16:16  IST  )

ప్రచారం ఏ పార్టీది అయినా జనం హోరెత్తుతున్నారు ఎత్తేది ఎజెండా అయినా వారి ఎజెండా మాత్రం డబ్బులు.. ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అయినా పార్టీలతో వారికి పనిలేదు ఓటు వేసేది ఎవరికైనా ప్రచారం మాత్రం అందరికి అన్నట్టుగా నెలకొంది పరిస్థితి.

ప్రచారానికి రూ.1000, కార్నర్ మీటింగ్ కు రూ.500, బిర్యాని
X

దిశ, కరీంనగర్ బ్యూరో : ప్రచారం ఏ పార్టీది అయినా జనం హోరెత్తుతున్నారు ఎత్తేది ఎజెండా అయినా వారి ఎజెండా మాత్రం డబ్బులు.. ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అయినా పార్టీలతో వారికి పనిలేదు ఓటు వేసేది ఎవరికైనా ప్రచారం మాత్రం అందరికి అన్నట్టుగా నెలకొంది పరిస్థితి. ప్రచారం అయితే ఉదయం 500 వందల రూపాయలు, మధ్యాహ్నం భోజనం సాయంత్రం 500 వందల రూపాయలు బిర్యాని కార్నర్ మీటింగ్ అయితే 500 రూపాయలు బిర్యాని ఏం నడుస్తుంది కరీంనగర్ లో ఎన్నికల వేళ అంటే ఓటు ఎవరికి వేసినా ప్రచారం మాత్రం మీరేచేయాలంటూ అభ్యర్థుల గోళా అంటూ సెటైర్లు వేయడం ఇక్కడ పరిస్థితికి నిలువెత్తు నిదర్శనం

జెండా ఏదైనా ఎజెండా డబ్బులే

ఎన్నికలు వచ్చాయంటే చాలు పట్టణాలు పల్లెలు తేడా లేదు పోటీచేసే అభ్యర్థులు డబ్బు ఖర్చుచేయాల్సిందే. ప్రచారానికి జనాన్ని తరలించాల్సిందే. ప్రచారానికి వచ్చే జనం వారికి పార్టీలతో సంబంధం లేదు జెండా ఏదైనా వారి ఎజెండా మాత్రం డబ్బులు తీసుకోవాలి. వారికి ఓటు వేయాలంటూ ప్రచారం సాగించాలి. ఉదయం ఒక్కరికి ప్రచారం చేస్తే సాయంత్రం మరో పార్టీ వారికి ప్రచారం నిర్వహించాలి ఇలా ప్రచారం నిర్వహించినందుకు అభ్యర్థులు వారికి ఉదయం 500 రూపాయలు, మధ్యాహ్నం భోజనం సాయంత్రం 500 వందల రూపాయలు బిర్యాని అప్పగించాల్సిందే. ఇక కార్నర్ మీటింగులకయితే 500 రూపాయలు బిర్యాని మహిళలు, యువతులు అయితే కూల్ డ్రింక్స్ పురుషులు యువకులు అయితే డబ్బులతో పాటు బీరు లేదా పెగ్గు మందు అప్పగించాల్సిందే. ఒక వేల ఎవరైనా అభ్యర్థి డబ్బులు ఖర్చుచేయకుండా ప్రచారం నిర్వహిస్తే జనం లేక వారి సభలు ప్రచారాలు వెల వెల పోతున్నాయి. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పార్టీ ఏదైనా ప్రచారం ఎవరికోసమైనా, జెండా ఏదైనా జనం ఎజెండా మాత్రం డబ్బులు తీసుకోవాలి ప్రచారానికి వెళ్లాలి అన్నట్లు పరిస్థితి నెలకొంది.

ప్రచారానికి డబ్బులు వెదజల్లుతున్న పార్టీలు

ఏ పార్టి మీటింగ్ అయినా జనం ఎగబడుతున్నారు. జనాన్ని చూసి ఈ పార్టిఏ గెలుస్తుంది అని ఫిక్స్ అయితే పొరపాటే జనం ఏ పార్టీ మీటింగ్​ అయినా జనం ఎగబడటం ఇక్కడ అభ్యర్థులను టెన్షన్ పెడుతుండగా గెలుపు ఓటముల పై అంచనాలకు విరుద్దంగా ఫలితాలు వెలుబడే ప్రమాదం లేకపోలేదు. ఎన్నికల కమిషన్ ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తూ డబ్బు ఖర్చులకు ప్రత్యేక నిబంధనలు పెట్టి లిమిట్స్ విధిస్తున్నా పార్టీలు అడ్డగోలుగా డబ్బులు వెదజల్లుతూ జనాన్ని తరలించడం, ప్రచారాన్ని నిర్వహించడం జనానికి ఆదాయం సమకూరుస్తుండగా జనంలో సైతం గెలిచాక వాళ్లు సంపాదించుకోవడం లేదా అనే వాదన వ్యక్తపరుస్తున్నారు. దీంతో ఏ పార్టీ అయినా డబ్బులు వెదజల్లాల్సిందే. ప్రచారం నిర్వహించాల్సిందే అన్నట్టుగా తయారైంది ఉమ్మడి జిల్లా వ్యాప్తాంగా పరిస్థితి

ఎన్నికల వేల ఏం నడుస్తుంది కరీంనగర్ లో ?

అభ్యర్థులు ఎవరైనా ఏ పార్టీకి చెందిన వారయినా జనం ప్రచారానికి రావాలి అంటే డబ్బులు ఇవ్వాలి జనాన్ని తరలించాల్సిన పరిస్థితి నెలకోవడం తో యూ ట్యూబర్స్ రీల్స్ చేసే వారు కరీంనగర్ లో ఏం నడుస్తుంది అంటే ప్రచారానికి వెళ్తే1000 రూపాయలు బిర్యాని అంటూ కార్నర్ మీటింగ్ అయితే 500 వందల రూపాయలు బీర్ అంటూ వీడియోలు చేస్తూ ట్రోల్ చేయడం ఎన్నికల వేళ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పార్టీలు ప్రచారాల పరిస్థితికి అద్దం పడుతుంది

Next Story