- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత సమ సమాజ దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే : తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల సంఘ నేతలు
వర్ణ వివక్షకు వ్యతిరేకంగా జీవితకాలం పోరాడిన సామాజిక విప్లవకారుడు, సమ సమాజ స్థాపన మార్గదర్శి మహాత్మా జ్యోతిరావు ఫూలే అని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఓబీసీ ఉద్యోగుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు కొండపలకల వేణుమాధవ్, ప్రాంతీయ కార్యదర్శి ఆలేటి రమేష్ కొనియాడారు.

దిశ కరీంనగర్, కలెక్టరేట్ : వర్ణ వివక్షకు వ్యతిరేకంగా జీవితకాలం పోరాడిన సామాజిక విప్లవకారుడు, సమ సమాజ స్థాపన మార్గదర్శి మహాత్మా జ్యోతిరావు ఫూలే అని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఓబీసీ ఉద్యోగుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు కొండపలకల వేణుమాధవ్, ప్రాంతీయ కార్యదర్శి ఆలేటి రమేష్ కొనియాడారు. మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా శనివారం బ్యాంక్ రీజనల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారు పూలేకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్మ పూలే జాతికి చేసిన సేవలను స్మరించుకున్నారు. సమాజంలో వెళ్లూనుకుపోయిన వర్ణ, కుల, లింగ వివక్షను రూపుమాపి,అందరికీ సామాజిక న్యాయం దక్కాలని పోరాడిన దార్శనికుడు మహాత్మా ఫూలే అన్నారు.సబ్బండ వర్ణాలు సామాజిక ఆర్థిక రంగాల్లో ముందడుగు వేయాలంటే విద్య ద్వారా మాత్రమే సాధ్యమౌతుందని భావించిన జ్యోతిరావు ఫూలే ఆశయాలు ఎల్లకాలం ఆచరణీయమైనవని తెలిపారు.
తన భార్య సావిత్రీబాయి ఫూలేకు చదువు నేర్పించి, చదువు నిరాకరించబడిన మహిళలకు విద్య నేర్పాలనే దృఢ సంకల్పాన్ని అనేక కష్ట నష్టాల నడుమ అమలు చేసిన, మహిళాభ్యుదయ మార్గదర్శి మహాత్మా ఫూలే అని కొనియాడారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఓబిసి ఉద్యోగుల సంఘం ప్రాంతీయ కార్యదర్శి ఆలేటి రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎస్సీ, ఎస్టీ, వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ సింగ్, ప్రాంతీయ కార్యదర్శి శేఖర్,ఎస్ఎంఓ కందుల సుబ్బారావు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ జి.తిరుపతి, ప్రాంతీయ కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, బీఎంఎస్ నాయకులు మూల రమణారెడ్డి, ఉడుత సాయి, కాపర్తి సతీష్, రాహుల్ ముదిమడుగుల, పులస కిరణ్, ఎన్ తిరుపతి, యామ కళ్యాణ్, సీనియర్ మేనేజర్ మురళీధర్ స్వామి పాల్గొన్నారు.






