- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అభివృద్ధి పథంలో తెలంగాణ పల్లెలు : ఎమ్మెల్యే సంజయ్ కుమార్
బీర్పూర్ మండలంలోని పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి,

దిశ , బీర్ పూర్ : బీర్పూర్ మండలంలోని పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి, పూర్తి అయిన అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బీర్పూర్ మండల కేంద్రంలో 20 లక్షల నిధులతో నిర్మించిన పైప్ లైన్ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయం దగ్గరలో ఉన్న ఎంఆర్సి భవనాన్ని ప్రారంభించారు. వీటితోపాటు తుంగూరులో కళ్యాణ మండపాన్ని, మంగేళలో ముదిరాజ్ సంఘ భవనాన్ని ప్రారంభించారు. కమ్మునూరు గ్రామ నూతన గ్రామపంచాయతీ భవనానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ గడిచిన ఐదు సంవత్సరాలు బీర్పూర్ మండలానికి అంబులెన్స్ సౌకర్యం మరియు నియోజకవర్గంలోని ప్రజలకు దళిత బంధు, బీసీ బందు, సీఎం రిలీఫ్ ఫండ్ ,కల్యాణలక్ష్మి, రైతు రుణమాఫీ వంటి అనేక పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో అందించాని మళ్ళీ ఆశీర్వదిస్తే అంతకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ జిల్లా మెంబర్ ముప్పాల రామచంద్రరావు, సర్పంచ్ గర్శకుర్తి శిల్ప రమేష్ ,ఉప సర్పంచ్ హరీష్, నాయకులు కొలుముల రమణ, మహిపాల్ రెడ్డి, నారపాక రమేష్, సుశీన్ అజిత్ రావు, శ్రీనివాసరావు, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, పాల్గొన్నారు.






