అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

by velandi.Saikiran |

ఉపాధ్యాయ వృత్తి చాలా విశిష్టమైనదని, ఈ వృత్తి ద్వారానే సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని అల్ఫోర్స్ విద్యాసంస్థల

అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
X

దిశ, కరీంనగర్ టౌన్ : ఉపాధ్యాయ వృత్తి చాలా విశిష్టమైనదని, ఈ వృత్తి ద్వారానే సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ లోని వివిధ అల్ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో వేడుకగా నిర్వహించిన ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ సంకల్పానికి మారుపేరని, నిస్వార్థతకు గొప్ప నిర్వచనమని చెప్పారు. తనదైన శైలిలో నిర్వాహణ కొనసాగించి దేశ ప్రజల హృదయాలలో జరిగిన చెరగని ముద్ర వేసుకున్న మహనీయుడని గుర్తు చేశారు. ఆయన జయంతిని పరిష్కరించుకొని ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించుకోవడం ఒక గొప్ప అనుభూతినిస్తుందని చెప్పారు. ఉపాధ్యాయుల ద్వారానే ఉత్తమమైన సమాజం ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story