- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్మిక సంక్షేమన్ని విస్మరించిన సింగరేణి యాజమాన్యం
యాజమాన్యం సింగరేణి సంస్థ రామగుండం రీజియన్-2 డివిజన్ పరిధిలోని కమ్యూనిటీ హాల్ రెంట్ ను పెంచుతు తీసుకున్న

దిశ, యైటింక్లయిన్ కాలనీ: యాజమాన్యం సింగరేణి సంస్థ రామగుండం రీజియన్-2 డివిజన్ పరిధిలోని కమ్యూనిటీ హాల్ రెంట్ ను పెంచుతు తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్ డిమాండ్ చేసారు. ఈ మేరకు సోమవారం ఏరియా ఎస్వోటూ జనరల్ మేనేజర్ మాలోత్ రాముడుకు మెమోరాండం ఇచ్చారు. అనంతరం అయన మీడియతో మాట్లాడారు. నామ మాత్రపు రెంట్ తో ఉన్న కమ్యూనిటీ హాల్ రెంట్ ను పెంచుతు యాజమాన్యం తీసుకున్న నిర్ణయం పై ఫైర్ అయ్యారు. క్లీనింగ్, ఎలక్ట్రికల్ చార్జీలు మినహా రూ.558 మాత్రమే ఉన్న నామమాత్రపు రెంట్ ను ఇష్టరీతిన అమాంతం 15 వేల రూపాయలకు కార్మిక కుటుంబాలకు, కార్మికేతరులకు 30 వేల రూపాయలు అద్దె వసూలుకు నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు.
మినిమమ్ ఫెసిలిటీస్ కల్పించని మేనేజ్మెంట్ ఇలా రెంట్స్ పెంచడం అన్యాయమన్నారు. బిజినెస్ మైండ్ సెట్ తో ప్రైవేటు ఫంక్షన్ హాల్ మాదిరిగా అద్దె నిర్ణయించడం సరికాదన్నారు. యాజమాన్యం అతి తెలివితో తీసుకున్న నిర్ణయం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించడమే అని ఆరోపించారు. వందల కోట్ల రూపాయలు కార్మిక, కార్మిక కుటుంబాల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే యాజమాన్యం సంక్షేమంలో భాగమైన కమ్యూనిటీ హళ్లకు అడ్డగోలు రేటు నిర్ణయించడం ఏమిటని ప్రశ్నించారు. సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ చెరుకు ప్రభాకర్ రెడ్డి, చంద్రయ్య, అబ్బు శ్రీనివాస్ రెడ్డి, రవితేజ, దాసరి శ్రీనివాస్, వెంకటేష్, మార్క నరేష్, రాకేష్ తదితరులు ఉన్నారు.






