సింగరేణి సెక్యూరిటీ సిబ్బందితో సంబంధం లేని పనులు

by Elthuri vijay kumar |   (  Updated:2025-09-11 11:36:15  IST  )

చర్చనీయాంశమైన ఉన్నతాధికారుల పనితీరు

సింగరేణి సెక్యూరిటీ సిబ్బందితో సంబంధం లేని పనులు
X

సింగరేణి సెక్యూరిటీ సిబ్బందితో సంబంధం లేని పనులు

- ఇష్టారీతిన వ్యవహరిస్తున్న అధికారులు

- చర్చనీయాంశమైన ఉన్నతాధికారుల పనితీరు

దిశ, రామగిరి: సింగరేణిలో సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులతో బుధవారం రాత్రి సింగరేణి అధికారులు ఇంటి సామాన్లు తరలించారు. రామగుండం 3 ఏరియా ఓసీ2 విస్తరణలో భాగంగా లద్నాపూర్ గ్రామాన్ని సింగరేణి సంస్థ సేకరించి పునరావాస కేంద్రానికి తరలించింది. గ్రామానికి చెందిన కొంతమందికి పరిహారం అందలేదని గ్రామంలోనే నివసిస్తున్నారు. ప్రస్తుతం మంథని పెద్దపల్లి ప్రధాన రహదారి మళ్లింపు కార్యక్రమం చేపట్టడంతో సింగరేణి అధికారులు అడ్డుగా ఉన్న మిగిలిన ఇండ్ల తొలగింపు మొదలుపెట్టారు.అయితే ఇతర కార్మికులు చేయాల్సిన పనులను రాత్రి సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ద్వారా చేయిస్తూ వాహనంలో తరలించారు. డిపార్ట్మెంట్ కు సంబంధం లేకుండా సెక్యూరిటీ సిబ్బందితో ఇలాంటి పనులు చేయించడం చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయమై వివరణ కోసం ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ ని ఫోన్ లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.

Next Story