ఇండియన్ ఆర్మీ ఎంపికలో సత్తా చాటిన గ్రామీణ యువకులు

by Ratna Kumari |

దేశ సేవ చేయాలనే సంకల్పంతో కష్టపడి చదివిన ఆ యువకులు తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని యువతకు ఆదర్శంగా నిలిచారు.

ఇండియన్ ఆర్మీ ఎంపికలో సత్తా చాటిన గ్రామీణ యువకులు
X

దిశ, పెగడపల్లి : దేశ సేవ చేయాలనే సంకల్పంతో కష్టపడి చదివిన ఆ యువకులు తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని యువతకు ఆదర్శంగా నిలిచారు. శనివారం ప్రకటించిన ఇండియన్ ఆర్మీ సైనిక ఫలితాల్లో మండలం లోని పలు గ్రామాల యువకులు తమ సత్తా చాటారు.

ఒకే గ్రామం నుంచి ముగ్గురు

మండలంలోని మద్దులపల్లి గ్రామం నుంచి ముగ్గురు యువకులు ఆర్మీకి ఎంపిక అయి గ్రామానికి వ‌న్నే తెచ్చారు. గ్రామానికి చెందిన అజ్మీరా ఈశ్వర్, అజ్మీరా హరీష్, కంబళ్ల అజయ్ అనే ముగ్గురు యువకులు ఆర్మీకి ఎంపిక అయ్యారు.

రైతు బిడ్డ.. ఆర్మీకి ఎంపిక

జై జవాన్ - జై కిసాన్ అనే నినాదం నిజం చేస్తూ మండలం లోని వెంగళాయిపేట గ్రామానికి చెందిన రైతు బిడ్డ ఆర్మీకి ఎంపిక అయ్యాడు.గ్రామానికి చెందిన తోట శంకర్ సాధారణ రైతు. తాను వ్యవసాయం చేస్తూ తన కుమారుడు తోట మనీష్ నీ దేశ సేవ కోసం పంపడానికి సన్నద్ధం చేపించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. మండలం లోని అయితుపల్లి గ్రామానికి చెందిన జెరిపోతుల రోహిత్ జనరల్ డ్యూటీ విభాగం లో ఎంపిక అయ్యాడు.కాగా రోహిత్ తన పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల లోనే చదవడం విశేషం. ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ యువత దేశ సేవ చేయడంలో ముందు ఉండాలని ఆర్మీకి ఎంపికైన‌ యువకులు గ్రామానికి వన్నె తెచ్చారని వారిని ఆదర్శంగా తీసుకుని మరింత మంది యువకులు ఆర్మీకి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఆర్మీకి ఎంపిక అయిన యువకులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడారీ తిరుపతి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పురుషోత్తమ అనిల్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు మ్యాకల అంజమ్మ, మోకినపల్లి గోపాల్, వెల్మా బల రాం రెడ్డి, గోలి సంజీవరెడ్డి, కుంచె రాజేందర్, పెంటల తిరుపతి గ్రామ‌స్తులు అభినందించారు.

Next Story