తీవ్ర ఉద్రిక్తత.. కరీంనగర్‌ కు Bandi Sanjay తరలింపు

by Satheesh |   ( Updated:2022-08-23 07:48:08.0  )
తీవ్ర ఉద్రిక్తత.. కరీంనగర్‌ కు Bandi Sanjay తరలింపు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: జనగామలో అరెస్ట్ చేసిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌ని వ్యూహాత్మకంగా కరీంనగర్‌కు తరలిస్తున్నారు. మార్గ మధ్యలోనే వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించాలన్న ప్రతిపాదనలు వచ్చినప్పటికీ ఆయా ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఆదేశించారు. దీంతో సంజయ్‌ని హుస్నాబాద్ మీదుగా హైదరాబాద్ తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయని కూడా భావించినప్పటికీ, చివరకు ఆయనను కరీంనగర్‌కు తరలించారు. అయితే కరీంనగర్ సమీపంలోకి చేరుకున్న సంజయ్‌ని పోలీస్ కమిషనరేట్ ట్రైనింగ్ సెంటర్ లేదా ఆయన ఇంటికి తరలించాలని యోచిస్తున్నారు.



Next Story

Most Viewed