పెద్దమ్మ చెక్ పోస్ట్ వద్ద‌ ఆకస్మిక తనిఖీ : సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి

by Nallavelli.Anjaneyulu |

దిశ, గంభీరావుపేట : గ్రామపంచాయతి ఎన్నికల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభిరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దమ్మ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి

పెద్దమ్మ చెక్ పోస్ట్ వద్ద‌ ఆకస్మిక తనిఖీ :  సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి
X

దిశ, గంభీరావుపేట : గ్రామపంచాయతి ఎన్నికల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభిరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దమ్మ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ త‌నిఖీల్లో నమోదు చేసిన రిజిస్టర్ ను పరిశీలించడంతో పాటు, ప్రత్యక్షంగా పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తున్న తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహారించందంతో పాటు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టాలని సూచించారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై ఎన్నికల నియమావళి ప్రకారం ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Next Story