- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రామగుండంలో ఆగుతాయి -పెద్దపల్లి ఎంపీ
ప్రజలకు మెరుగైన రైలు ప్రయాణం అందించాలనే లక్ష్యంతో, అధికారులతో మాట్లాడి రామగుండం రైల్వే స్టేషన్ లో సూపర్‌ఫాస్ట్ ఎ

దిశ, గోదావరిఖని: ప్రజలకు మెరుగైన రైలు ప్రయాణం అందించాలనే లక్ష్యంతో, అధికారులతో మాట్లాడి రామగుండం రైల్వే స్టేషన్ లో సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగే విధంగా చర్యలు తీసుకున్నానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గురువారం తెలిపారు. దీంతో వేలాది మంది ప్రయాణికులకు మెరుగైన రైలు అనుసంధానం, సౌకర్యవంతమైన ప్రయాణం, సులభమైన రవాణా సౌకర్యాలు లభిస్తుందన్నారు. దూర ప్రయాణం వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపార వర్గాలు అందరికీ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు రవాణా సౌకర్యం ఏర్పడిందన్నారు. నూతనంగా మంజూరైన రైళ్లను సమయాలను ప్రజలు తెలుసుకుని వినియోగించుకోవాలని కోరారు.
రామగుండం స్టేషన్ నూతనంగా ఆగుతున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు
12295 – సంగమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ,
12578 – బాగ్మతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (మైసూరు → దర్భంగా) |
12721 – దక్షిణ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (హైదరాబాద్ → హజ్రత్ నిజాముద్దీన్)
22535 – రామేశ్వరం–బరౌని సూపర్ ఫాస్ట్
22669 – ఎర్నాకులం–పట్నా సూపర్ ఫాస్ట్






