మరణానంతరం శరీరదానం.. మెడికల్ విద్యార్థుల కోసం అరుదైన సేవ

by Bhanu |

మరణించిన అనంతరం తన మృతదేహాం పలువురికి ఉపయోగపడే విధంగా మలచాలనే సంకల్పంతో కుటుంబ సభ్యుల సహకారంతో మెడికల్ కళాశాలకు అందించాలన్న తన కోరికను వారి కుటుంబ సభ్యులు నెరవేర్చారు.

మరణానంతరం శరీరదానం.. మెడికల్ విద్యార్థుల కోసం అరుదైన సేవ
X

దిశ, సుల్తానాబాద్: మరణించిన అనంతరం తన మృతదేహాం పలువురికి ఉపయోగపడే విధంగా మలచాలనే సంకల్పంతో కుటుంబ సభ్యుల సహకారంతో మెడికల్ కళాశాలకు అందించాలన్న తన కోరికను వారి కుటుంబ సభ్యులు నెరవేర్చారు. పలువురు మెడికల్ విద్యార్థులు తన దేహంతో వైద్య వృత్తిలో రాణిస్తారని ఆశించిన వారి కోరికను కుటుంబ సభ్యులు నెరవేర్చారు. వివరాల్లోకి వెళితే మండల కేంద్రానికి చెందిన కీ.శే. పెగడ లక్ష్మి నారాయణ శుక్రవారం రాత్రి సమయంలో అనారోగ్యంతో మృతిచెందగా వారి ఆశయం మేరకు, కుటుంబ సభ్యులు సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ప్రతిమ మెడికల్ కాలేజీ కరీంనగర్ వారికి శరీర దానం చేశారు.


సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ మేరుగు భీష్మా చారిని సంప్రదించగా,ప్రతిమ మెడికల్ కాలేజీ కరీంనగర్ వారి సహకారంతో దేహాన్ని వారికి అందించారు.మరణించి కూడా వైద్య విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడుతున్న శరీరదాత లక్ష్మి నారాయణ కు నివాళులు అర్పిస్తూ సహకరించిన కుటుంబ సభ్యులు పెగడ రాజమౌళి, రమేష్, అయిలయ్య, పరుష రాములు, చందు, శ్రీనివాస్, ఆంజనేయులు,కిషన్,సూర్యం ల కు ప్రతిమ మెడికల్ కాలేజీ అనాటమీ హెడ్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కిషన్ రెడ్డి, సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, కార్యదర్శి డాక్టర్ భీష్మ చారి పలువురు అభినందనలు తెలిపారు. .

Next Story