- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుజూరాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కేసరి శేషయ్య విజయం
హుజూరాబాద్ బార్ అసోసియేషన్ 2026-27 సంవత్సరానికి సంబంధించి గురువారం నిర్వహించిన ఎన్నికలు అత్యంత ఉత్కంఠ భరితంగా సాగాయి.

దిశ, హుజూరాబాద్ రూరల్ : హుజూరాబాద్ బార్ అసోసియేషన్ 2026-27 సంవత్సరానికి సంబంధించి గురువారం నిర్వహించిన ఎన్నికలు అత్యంత ఉత్కంఠ భరితంగా సాగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పోలింగ్‌లో న్యాయవాదులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 125 ఓట్లు పోల్ అవ్వగా.. రాత్రి ప్రకటించిన ఫలితాల్లో అధ్యక్షుడిగా కేసరి శేషయ్య విజయం సాధించారు. అధ్యక్షుడు గా కేసరి శేషయ్యకు 63 ఓట్లు రాగా.. తన సమీప ప్రత్యర్థి శంకర్ కనుకుంట్ల (57 ఓట్లు) పై 6 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. మరో అభ్యర్థి కామాని సమ్మయ్యకు 04 ఓట్లు లభించాయి. ప్రధాన కార్యదర్శిగా పాక జ్యోత్స్నా దేవి 85 ఓట్లు సాధించి, ప్రత్యర్థి సరిత కుమ్బాకర్ (34 ఓట్లు) పై భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు.
ఉపాధ్యక్షుడుగా రాజేష్ పిట్టాల 84 ఓట్లు సాధించి, బత్తుల తిరుపతి (39 ఓట్లు) పై గెలుపొందారు. జాయింట్ సెక్రటరీగా ముక్కోణపు పోటీలో యెంగాల లింగమూర్తి 47 ఓట్లతో విజేతగా నిలిచారు. గుంటి హరిహరన్ (39), గుడెపు వంశీకృష్ణ (36) ఓట్లు సాధించారు. క్రీడలు , సాంస్కృతిక కార్యదర్శిగా మోరే కళ్యాణ్ 74 ఓట్లతో ముంజాల విజయ్ (48) పై గెలిచారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా యాస్మిన్ 66 ఓట్లతో చిదురాల శ్రీనివాస్ (59) పై విజయం సాధించారు. ఎన్నికల అధికారులు జోజుల ప్రవీణ్ కుమార్, గురాల వెంకట్ కుమార్, బాగోతు కుమారస్వామి సమక్షంలో ఓట్ల లెక్కింపు అత్యంత పారదర్శకంగా జరిగింది. ఫలితాల అనంతరం ఎన్నికల అధికారులు నూతన కార్యవర్గానికి ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. న్యాయవాదుల సంక్షేమం కోసం, బార్ అసోసియేషన్ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తామని ప్రకటించారు.






