- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇస్రోను సందర్శించిన మేడిపల్లి మండల విద్యార్థులు
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల నుంచి ఇటీవలి పదో తరగతి ఫలితాలలో టాపర్స్ గా నిలిచిన విద్యార్థులు బుధవారం కేరళం - తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ను సందర్శించారు.

దిశ, మేడిపల్లి : జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల నుంచి ఇటీవలి పదో తరగతి ఫలితాలలో టాపర్స్ గా నిలిచిన విద్యార్థులు బుధవారం కేరళం - తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ను సందర్శించారు. మేడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచన మేరకు, మండల కాంగ్రెస్ నాయకులు ఏనుగు రమేష్ రెడ్డి, చేపూరి నాగరాజు, బొంగొని రాజా గౌడ్, శేరు నగేష్, తేలు నరేష్, మన ఊరు ఫౌండేషన్ - వల్లంపల్లి నవీన్ రెడ్డి ఆర్ధిక సహకారంతో చేపట్టిన ఈ విజ్ఞాన యాత్రలో భాగంగా ఇవాళ ఇస్రో నిర్వహించిన ఆర్ హెచ్ -200 సౌండింగ్ రాకెట్ లాంచ్ ను ప్రత్యక్షంగా వీక్షించారు. స్పేస్ సైన్స్ మ్యూజియంను సందర్శించి భారతీయ స్పేస్ రంగం గురించి తెలుసుకున్నారు. విద్యార్థులు హైదరాబాద్ నుంచి తిరువనంతపురం వరకు వారి తొలి విమాన ప్రయాణం చిరకాలం నిలిచిపోయేలా గుర్తుండిపోతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు మండల ఎంఈఓ లక్ష్మీనరసయ్య, పి జి హెచ్ ఎం కరుణ, మన ఊరు ఫౌండేషన్ - నవీన్ రెడ్డి లు పాల్గొన్నారు.






