- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమాజ మార్పునకు విద్యార్థులు పునాది కావాలి
విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని ఆకాంక్షించారు.

దిశ, హుజూరాబాద్ రూరల్ : విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని ఆకాంక్షించారు. బుధవారం హుజూరాబాద్ పట్టణంలోని మాంటిస్సోరి పాఠశాలలో పదోతరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థులు కేవలం మార్కులకే పరిమితం కాకుండా, క్రమశిక్షణతో కూడిన మంచి నడవడికను అలవర్చుకోవాలని సూచించారు. అప్పుడే తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు. పట్టణ విద్యార్థులు జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో రాణించి హుజూరాబాద్ కీర్తిని చాటాలని ఆమె కోరారు. పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను చైర్‌పర్సన్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ షాజూ థామస్, ఉపాధ్యాయులు రమేష్, అజ్మత్ అలీ, అబీద్ పాషా, తిరుపతి, రవీందర్, రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రతిభ కనబరిచిన విద్యార్థులు
G. రిషి వర్ధన్ (583)
M. నిహాల్ (581)
G. అభినవ్ (581)
మహమ్మదీ బేగం (577)
M. ప్రణతి (573)
K. సాన్విత్ (571)






