బాల రచయితల సమ్మేళనానికి విద్యార్థుల ఎంపిక

by Nallavelli.Anjaneyulu |

దిశ, ధర్మారం : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వారు నిర్వహించే అంతర్జాతీయ శతాధిక బాల రచయితల సమ్మేళనంకు ధర్మారం మండలంలోని నర్సింహులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత

బాల రచయితల సమ్మేళనానికి విద్యార్థుల ఎంపిక
X

దిశ, ధర్మారం : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వారు నిర్వహించే అంతర్జాతీయ శతాధిక బాల రచయితల సమ్మేళనంకు ధర్మారం మండలంలోని నర్సింహులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నవంబర్ 30న ఆన్ లైన్ లో 13 గంటల పాటు నిర్విఘ్నంగా నిర్వహించే బాల సాహిత్యభేరి కార్యక్రమంలో కథ, వచన కవిత, గేయం, పద్యం విభాగాల్లో ప్రపంచవ్యాప్తంగా 101 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. నర్సింహులపల్లిలో 10వ తరగతి చదువుతున్న గంగారపు శృతి, దారవేణి అశ్విత, అలిశెట్టి రాహుల్ , తొమ్మిదవ తరగతి చదువుతున్న సింగం శశాంత్, ఎనిమిదవ తరగతి చదువుతున్న గన్ముకుల లవన్ కుమార్ లు కథ, వచన కవిత విభాగంలో తమ కథలను,కవితలను జూమ్ వేదికగా వినిపించనున్నారు. ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో తమ పాఠశాల విద్యార్థులకు పాల్గొనే అరుదైన అవకాశాన్ని కల్పించిన తానా నిర్వాహకులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అజ్మీర రమేష్ నాయక్ ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు నరేందర్, ఆంజనేయులు, పుష్పలత, శ్రీనివాస చక్రవర్తి, రామ చంద్రారెడ్డి,కందుకూరి భాస్కర్ లు అభినందించారు.

Next Story