అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు : సీఐ నిరంజన్ రెడ్డి

by Ratna Kumari |   (  Updated:2026-01-19 01:37:13  IST  )

ఇసుక‌ను అక్ర‌మ ర‌వాణా చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని క‌రీంన‌గ‌ర్ రూర‌ల్ పోలీసులు సీఐ నిరంజ‌న్ రెడ్డి హెచ్చ‌రించారు.

అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు : సీఐ నిరంజన్ రెడ్డి
X

దిశ, కరీంనగర్ రూరల్ : ఇసుక‌ను అక్ర‌మ ర‌వాణా చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని క‌రీంన‌గ‌ర్ రూర‌ల్ సీఐ నిరంజ‌న్ రెడ్డి హెచ్చ‌రించారు. గుంటూరుప‌ల్లి బ‌స్టాండ్ వ‌ద్ద ఓ ఇసుక ట్రాక్ట‌ర్ ను స్వాధీనం చేసుకున్నారు. సీఐ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఇసుక మాఫియా దారులకు రోజుకో వల విసురుతున్నారు. కరీంనగర్ పట్టణం బొమ్మకల్ కు చెందిన కాశీపాక శివకుమార్ తన ట్రాక్టర్ డ్రైవర్ కాశీపాక మహేష్ సాయంతో మనేర్ వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తుండగా కరీంనగర్ రూరల్ పోలీస్ లు అదివారం గుంటూరుపల్లి బస్ స్టాండ్ వద్ద పట్టుకొని ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి ట్రాక్టర్ సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. చట్ట వ్యతిరేక పనుల‌కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయ‌ని సీఐ హెచ్చరించారు.

Next Story